యూఎల్సీ భూముల జోలికి హైడ్రా రాదు

యూఎల్సీ భూముల జోలికి హైడ్రా రాదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూముల్లోని పాత లేఅవుట్లలో ఇళ్లున్నా, రెగ్యులరైజ్ కాని ఖాళీ ప్లాట్లు ఉన్నా వాటి జోలికి తాము వెళ్లమని హైడ్రా శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

హైడ్రా పేరు చెప్పి ఎవరైనా ఇటువంటి ప్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే నమ్మవద్దని, సందేహాలుంటే నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. కేవలం లేఅవుట్లలోని పార్కులు, రహదారుల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురైతే మాత్రమే చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. 

ఇప్పటికే కొండాపూర్, హైదర్ నగర్ ప్రాంతాల్లోని పార్కు స్థలాల్లో ఉన్న ఆక్రమణలను మాత్రమే తొలగించినట్లు, నివాస గృహాలను కూల్చివేసే ఉద్దేశం లేదని హైడ్రా పునరుద్ఘాటించింది.