పుప్పాలగూడ భూముల పరిశీలన

పుప్పాలగూడ భూముల పరిశీలన
  • కబ్జా కాకుండా కంచె ఏర్పాటు చేస్తం
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో 200 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక్కడ దేవాలయాలకు, దర్గాకు పదెకరాల వరకూ భూమి ఇచ్చినట్టు చెబుతున్నారని, దీన్ని రెవెన్యూ వాళ్లతో క్రాస్​చెక్​చేసుకుంటామన్నారు. తర్వాత హద్దులు నిర్ధారించి కంచెలు వేస్తామన్నారు.  

452/1, 454/1 సర్వే నంబర్లలో ఉన్న కొండలను పరిరక్షించాలని సొసైటీ టూ సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ బుధవారం పరిశీలించారు. ఎవరైతే భూములు పొందారో వారితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి వారికి కేటాయించిన భూములకు ఫెన్సింగ్ వేసి మిగతా భూమిని పరిరక్షిస్తామన్నారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తామన్నారు.

ఈ గుట్టలను ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా పరిరక్షించాలని స్థానికులు కోరారు. చెరువుకు వరదను తెచ్చే ఇన్లెట్స్ కూడా మూసేసారని, చారిత్రక గుట్టల చెంతనే ఉన్న ఈ చెరువును కాపాడితే ప్రకృతిని పరిరక్షించినట్టు అవుతుందన్నారు. నార్సింగిలో 160 ఎకరాల మేర ఉన్న చారిత్రక రాళ్ల గుట్టలను కూడా హైడ్రా కమిషనర్  పరిశీలించారు.

నిథిమ్ చెరువు సంద‌‌‌‌‌‌‌‌ర్శన

నిథిమ్ డైరెక్టర్  వెంక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ణ ఆహ్వానం మేర‌‌‌‌‌‌‌‌కు గచ్చిబౌలిలోని నిథిమ్‌‌‌‌‌‌‌‌ ఆవ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌లోని చెరువును హైడ్రా క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్ ప‌‌‌‌‌‌‌‌రిశీలించారు. ఒక‌‌‌‌‌‌‌‌ప్పుడు బోటు షికారు సాగే ఈ చెరువు ఇప్పుడు మురుగునీటి కూపంగా మారిపోయింది. గ‌‌‌‌‌‌‌‌త వైభ‌‌‌‌‌‌‌‌వాన్ని తీసుకు వ‌‌‌‌‌‌‌‌చ్చేందుకు తీసుకోవాల్సిన చ‌‌‌‌‌‌‌‌ర్యల‌‌‌‌‌‌‌‌పై నిథిమ్ డైరెక్టర్ తో చ‌‌‌‌‌‌‌‌ర్చించారు. పూడిక తీత‌‌‌‌‌‌‌‌తో పాటు చుట్టూ బండ్ నిర్మించాల్సి ఉంద‌‌‌‌‌‌‌‌న్నారు. చెరువు చుట్టూ  చిన్నపిల్లలు ఆడుకునే స్థలం, ఓపెన్ జిమ్‌‌‌‌‌‌‌‌, వాకింగ్ ట్రాక్ ఇలా అన్ని సౌక‌‌‌‌‌‌‌‌ర్యాలు క‌‌‌‌‌‌‌‌ల్పిస్తున్నామ‌‌‌‌‌‌‌‌న్నారు.