నాలాలు, చెరువులను కాపాడండి...హైడ్రా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు

నాలాలు, చెరువులను కాపాడండి...హైడ్రా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు
  • 39 దరఖాస్తులు స్వీకరించిన  అడిషనల్​ కమిషనర్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 39 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైడ్రా అడిషనల్ కమిషనర్  అశోక్ స్వీకరించారు. ఇందులో అత్యధికంగా వ‌‌‌‌ర‌‌‌‌ద ముంచెత్తడానికి కార‌‌‌‌ణ‌‌‌‌మవుతున్న నాలాలు, చెరువుల ఆక్రమణలకు సంబంధించినవే ఉన్నాయి. 

పార్కులు, ర‌‌‌‌హ‌‌‌‌దారుల ఆక్రమ‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌పై కూడా ఫిర్యాదులందాయి. సంతోష్‌‌‌‌న‌‌‌‌గ‌‌‌‌ర్ డివిజ‌‌‌‌న్‌‌‌‌లోని ఐఎస్ స‌‌‌‌ద‌‌‌‌న్ ప్రాంతాన్ని వ‌‌‌‌ర‌‌‌‌ద నీరు ముంచెత్తుతోంద‌‌‌‌ని స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చింది. లంగర్‌‌‌‌హౌస్‌‌‌‌లోని బాపూఘాట్‌‌‌‌, టోలీచౌకి బ్రిడ్జి ప‌‌‌‌రిస‌‌‌‌రాల్లో వ‌‌‌‌ర్షం పడితే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. 

సోమాజీగూడ య‌‌‌‌శోద ఆసుప‌‌‌‌త్రి ప‌‌‌‌రిస‌‌‌‌రాల్లో నీరు నిలిచిపోవ‌‌‌‌డంతో పంజాగుట్ట ప్రాంతంలోని ప‌‌‌‌లు కాల‌‌‌‌నీల్లో సమస్య ఏర్పడుతుందని, అలాగే జూబ్లీ హిల్స్‌‌‌‌లోని సీవీఆర్ న్యూస్ వ‌‌‌‌ద్ద వ‌‌‌‌ర‌‌‌‌ద నీరు నిలుస్తుందని జర్నలిస్టు కాలనీ ప్రతినిధులు కంప్లయింట్​ చేశారు. ఇక్కడి నీటిని  ప‌‌‌‌క్కనే ఉన్న కేబీఆర్ పార్కులోకి మ‌‌‌‌ళ్లిస్తే స‌‌‌‌మ‌‌‌‌స్య ప‌‌‌‌రిష్కార‌‌‌‌మవుతుందని అభిప్రాయపడ్డారు.