హైడ్రా హెల్ప్ లైన్ నంబర్ 1070

హైడ్రా హెల్ప్ లైన్ నంబర్ 1070

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా టోల్​ఫ్రీ నంబర్ 1070ను అందుబాటులోకి తెచ్చినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే ఈ టోల్‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెట్లు పడిపోవడం, వరదలు, అగ్ని ప్రమాదాల వంటి ప్రమాదకర పరిస్థితుల్లో హైడ్రా సేవల కోసం సంప్రదించవచ్చన్నారు. 

అలాగే ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం 8712406899 నంబర్​కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వాట్సాప్ ద్వారా ఈ నంబర్‌‌‌‌‌‌‌‌కు పంపవచ్చన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో, భారీ వర్షాల వల్ల కాలనీలు, రహదారులు నీటమునిగినా లేదా అగ్ని ప్రమాదాలు జరిగితే 8712406901, 9000113667 నంబర్లను సంప్రదించాలని కోరారు.