
ఘట్కేసర్, వెలుగు: రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించగా హైడ్రా అధికారులు కూల్చేశారు. పోచారం మున్సిపాలిటీ కచవానిసింగారంలో చౌదరిగూడ మాజీ సర్పంచ్ భర్త నక్క నర్సింహ్మా వెంచర్ చేసి పలువురికి ప్లాట్లు అమ్మేశాడు. రోడ్డును కబ్జా చేసి ప్లాట్ల యజమానులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మంగళవారం హైడ్రా అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డును కబ్జా చేసి కట్టిన ప్రహరీని కూల్చేశారు.