అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా.. రాజేంద్రనగర్లో భవనాలు కూల్చివేత

అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా.. రాజేంద్రనగర్లో  భవనాలు కూల్చివేత

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు. శివరాంపల్లి చెరువును కబ్జా చేసి ప్లాట్లగా మార్చి.. నిర్మాణాలు  చేపట్టారు కొందరు వ్యక్తులు. చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతో.. హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు అధికారులు.

ప్రభుత్వ జాగాల్లో నిర్మాణాలు  చేపడితే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. నిర్మాణాల కూల్చివేతల సమయంలో భారీ భద్రత ఏర్పాటు  చేశారు పోలీసులు.