
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ లో హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. రెడ్డి ఎన్ క్లేవ్ పార్కు కబ్జా చేశారంటూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల మేరకు విచారణ చేసిన అధికారులు పార్కు కబ్జాకు గురైనట్లు నిర్ధారించారు. మొత్తం 2,640 గజాల స్థలం పార్కుకు కేటాయించినదేనని తేల్చారు.
శనివారం (జులై 05) పార్కులో కబ్జాలను తొలగించిన అధికారులు.. చుట్టూ ఫెన్సింగ్ వేసి, పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని బోర్డును ఏర్పాటు చేశారు. హైడ్రా పార్కు కబ్జాలను తొలగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ త 25 ఏళ్లుగా పార్కు కోసం పోరాడుతున్నామని.. ఫిర్యాదు చేసిన వెంటనే తమకు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఈ సందర్భంగా థాంక్యూ హైడ్రా అంటూ ప్లకార్డులు ప్రదర్శించి కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ | హైదరాబాద్లోని కూకట్ పల్లి ఆర్జీవీ లేడీస్ హాస్టల్ ఇంత ఘోరమా..?