
శనివారం ( ఆగస్టు 23 ) మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో హైడ్రా కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు రంగనాథ్. హైడ్రా పై ప్రజలకు మరింత క్లారిటీ రావాలని.. హైడ్రా ఒకటి, రెండేళ్లకు పరిమితం కాదని అన్నారు. వందేళ్ళ ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ హైడ్రా అని అన్నారు. హైడ్రా ఇప్పుడు చేస్తున్న పనులు.. నెక్స్ట్ వంద ఏళ్లకు ఉపయోగపడతాయని అన్నారు రంగనాథ్.
ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ది చేస్తున్నామని... సీఎస్ఆర్ పేరుతో చెరువులను అక్రమించుకోడానికి ప్రయత్నం చేశారని అన్నారు. అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళను రానివ్వడం లేదని అన్నారు రంగనాథ్. అన్ని సాంకేతిక ఆధారాలతో చెరువుల FTL మార్క్ చేస్తున్నామని.. చెరువుల దగ్గర భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయని అన్నారు.
గత ఏడాది జూలై లో ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని.. జిహెచ్ఎంసి యాక్ట్ లో మార్పులు చేసి తమకు సంబంధించిన అధికారాలు కల్పించిందని అన్నారు.సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ భాగానే చేస్తున్నామని.. తమ వైపు తప్పు జరిగితే సమీక్షించుకుంటమని స్పష్టం చేశారు రంగనాథ్. హైడ్రాకు ప్రభుత్వం నుంచి చాలా సపోర్ట్ ఉందని.. సీఎం సహా ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు చాలా సహకరిస్తున్నారని అన్నారు. వరదల్లో కొన్ని ప్రాంతాల్లో సివెజ్ మురుగు వస్తుందని.. అలాంటి విషయాల్లో పరిష్కారం కోసం పని చేయడం ముఖ్యమని భావిస్తున్నామని అన్నారు.
హైడ్రా కు డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్యమైన విషయమని.. పర్యావరణం పరిరక్షణ కోసం ఎక్కువ పనిచేస్తున్నామని అన్నారు. నాలాల్లో వేలాది ట్రక్కుల పూడికతీత పనులను చేస్తున్నామని.. వర్షం లేనప్పుడు హైడ్రా సిబ్బంది నాలాలు, మ్యాన్ హోల్స్ క్లీన్ చేయించడం జరుగుతుందని అన్నారు.చెరువుల్లో కూల్చివేతల సమయంలో చాలా ఆరోపణలు వచ్చాయని.. బతుకమ్మ కుంట, కూకట్ పల్లి చెరువులను బాగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.ఈ క్రమంలో అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ లో, ఫోర్కాస్ట్ లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు రంగనాథ్. 60నుంచి 65 శాతం చెరువులు మాయం అయ్యాయని.. పొల్యూషన్ వల్ల అనేక సమస్యలు వచ్చాయి.. వాటిని అడ్డుకోవాలని అన్నారు. CSR కింద చెరువులు కొట్టేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు రంగనాథ్.
చెరువుల మాదిరిగా నాలాలు కబ్జాలు నిరోధించేందుకు వాటిని నోటిఫై చేస్తామని.. నాలాలు డెవలప్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసిందని.. హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడ లేదని అన్నారు కమిషనర్ రంగనాథ్.