
హైదరాబాద్ లోని కొండాపూర్ లో పార్కును కాపాడింది హైడ్రా. కొండాపూర్ లోని మాధవ హిల్స్ ఫేజ్ 2 లో ఉన్న పార్కు స్థలంలో ఆక్రమణలు తొలగించింది హైడ్రా. ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా మంగళవారం ( సెప్టెంబర్ 16 ) పార్కు స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించింది. వెయ్యి గజాల పార్కు స్థలంలో స్థానికులు గోడలు కట్టి, షెడ్లు వేశారంటూ హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు మాధవ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు.
మాధవ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. పార్కు స్థలం ఆక్రమణకు గురైనట్లు నిర్దారించుకున్నారు. ఈ క్రమంలో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అధికారులు.
ఆక్రమణకు గురైన పార్కు స్థలం విలువ సుమారు రూ. 11.50 కోట్లు ఉంటుందని తెలిపారు అధికారులు. ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని కాపాడినట్లు ప్రకటించింది హైడ్రా. ఈ మేరకు పార్కు స్థలంలో ఒక బోర్డును ఏర్పాటు చేసింది హైడ్రా.