- ఒక్కచోటకు చేరిన పురాతన వస్తువులు, పాత కరెన్సీ, స్టాంపులు
- మూడు రోజుల పాటు నిర్వహణ
మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లిలోని ప్యాప్సి భవన్లో ఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘హైపెక్స్-–2025’ పేరిట మూడు రోజుల పురాతన వస్తువులు, స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్ల ఎగ్జిబిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
సొసైటీ ప్రతినిధులతో కలిసి ఈ ప్రదర్శనను హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ జీఎం శ్రీపాద రామదాస్ వాజపేయి ప్రారంభించారు. కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు, నిజాం కాలం నుంచి దేశవ్యాప్తంగా వివిధ కాలాల్లో చలామణీలో ఉన్న అరుదైన స్టాంపులు, నాణేలు, పాత కరెన్సీ నోట్లతోపాటు పురాతన వస్తువులను ఇందులో ప్రదర్శించారు.
ఈ ఎగ్జిబిషన్ ను ప్రజలు సందర్శించి, ఇష్టమైన వస్తువులను కొనుగోలు కూడా చేయవచ్చని సొసైటీ కార్యదర్శి సాగి శ్రీనివాసరాజు తెలిపారు.
