15సార్లు గుట్టకు వచ్చి.. ఒక్కసారైనా భువనగిరి రాకపోవడం బాధాకరం

15సార్లు గుట్టకు వచ్చి.. ఒక్కసారైనా భువనగిరి రాకపోవడం బాధాకరం
  • వాసాలమర్రిలో 75కుటుంబాలకు రైతు బంధు ఇవ్వలేదు.. ఇగ 2లక్షల కోట్లతో దళితబంధు ఏమిస్తాడు
  • లక్షసార్లు మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్
  • భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

యాదాద్రి జిల్లా: రేపు ముఖ్యమంత్రి కార్యక్రమానికి శాంతియుతంగా వెళ్లి ఆలేరు, భువనగిరి నియోజక వర్గాల సమస్యలను తెలుపుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అన్నారు. ప్రగతిభవన్ ఆగమేఘాల మీద కట్టిండు..9ఏళ్లు అవుతున్నా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికి 15 సార్లు యాదగిరిగుట్ట  వచ్చిన ముఖ్యమంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిని సందర్శించకపోవడం బాధాకరం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు మునిసిపాలిటీలకు నిధులు ఇస్తానన్న ముఖ్యమంత్రి 7 నెలలైనా ఇప్పటివరకు ఇవ్వలేదు.. వెంటనే నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 

ఇవి కూడా చదవండి

సూపర్, మెగా, బాహుబలి లెవల్లో అడుక్కున్నరు

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?

 

ముఖ్యమంత్రి మాటంటే మాట అంటావు.. కానీ ఇప్పటికీ లక్ష సార్లు  మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. భువనగిరి పట్టణంలో సంబంధించిన సమస్యల పరిష్కారానికై  వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. వాసాలమర్రిలో 75 కుటుంబాలకు రైతుబంధు చెల్లించని ముఖ్యమంత్రి  రెండు లక్షల కోట్లతో దళిత బంధును ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్  అనడం భావ్యం కాదని, వెంటనే  తన మాటలను ఉపసంహరించుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉండటం వల్లే ఈరోజు పేదవాడు రెండు పూటలా అన్నం తింటున్నాడని ఆయన పేర్కొన్నారు. ఆగఘాల మీద ప్రగతి భవన్ నిర్మించిన ముఖ్యమంత్రి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు.