దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాట తప్పే మనిషి కాదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. దొర ఇచ్చిన మాట కోసం తల నరుక్కుంటాడు తప్పితే మాట తప్పే మనిషి కాదని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఏడేండ్ల కింద సూసైడ్ చేసుకున్న 133 మంది రైతులకు ఇప్పటిదాకా ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని దుయ్యబట్టారు. రూ.6 లక్షలు ఇస్తామని 2015లో ఇచ్చిన జీవో కాగితాలకే పరిమితమైందని.. రైతు కుటుంబాలకు ఇప్పటివరకు పరిహారం అందలేదని మండిపడ్డారు. ‘దొరకు కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ ఇచ్చిన జీవో గుర్తుకురాదు. కరోనా టెస్టులు పెంచాలని, టీఎస్పీఎస్సీ సభ్యులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో కమిషన్లను ఏర్పాటు చేయండని, ఆఖరికి చనిపోయిన రైతులను ఆదుకోవాలని కోర్టులే చెప్పాలి’ అని షర్మిల పేర్కొన్నారు. కోర్టులు చెబితేకానీ బాధ్యతలు గుర్తుకురాని ఈ చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని ఆమె విమర్శించారు. 

మరిన్ని వార్తల కోసం:

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

అప్పుడు ఉద్యమకారుల్లా... ఇప్పుడు ఉగ్ర‌వాదుల్లా కనిపిస్తున్నారా?

నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతాను