జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతా

జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతా

రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి  నటించిన చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్​లో  హీరో రవితేజ అన్నారు. ‘కొత్త టెక్నీషియన్స్‌‌తో ఈ సినిమా చేశాను. అందరూ బెస్ట్ ఇచ్చారు. నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతాను. మిగతా తొంభై తొమ్మిది శాతం  కష్టాన్ని మాత్రమే నమ్ముతాను. రమేష్ వర్మని చూస్తే జాతకం, అదృష్టం కలిసి వచ్చాయనిపిస్తుంది. నేను సగటు ప్రేక్షకుడిగా సినిమా చూస్తాను. నాకు బాగా నచ్చింది.  మీకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. ఈ సినిమాతో అందరి హృదయాల్లోకి వెళ్తానంది మీనాక్షి. ‘చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నాను. రవితేజ దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంది డింపుల్. ఇన్వాల్వ్ అయి చేసిన  రవితేజకి థ్యాంక్స్ చెప్పాడు రమేష్ వర్మ. రవితేజ ఎనర్జీ చూసి తనతో మరో సినిమా చేయాలనిపించిందన్నారు నిర్మాత. అనసూయ, దేవిశ్రీ ప్రసాద్​తో పాటు రవితేజతో వర్క్ చేస్తున్న  దర్శకులు త్రినాథరావు నక్కిన, శరత్ మండవ కూడా పాల్గొన్నారు.