- మిగిలిన వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు
కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌పై రాళ్ల దాడి కేసులో బీఆర్ఎస్, సీపీఐకి చెందిన 20 మందిపై రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా ఘటనకు కారకులైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, దొమకొండ అనిల్, రామిడి లక్ష్మికాంత్‌ను బుధవారం రిమాండ్‌కు తరలించారు మిగిలిన వారి కోసం ప్రత్యేకటీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నామని రామకృష్ణాపూర్ఎస్సై జె.శ్రీధర్ గురువారం తెలిపారు.
