సూపర్, మెగా, బాహుబలి లెవల్లో అడుక్కున్నరు

సూపర్, మెగా, బాహుబలి లెవల్లో అడుక్కున్నరు

సినీ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం జగన్ పై ఆర్జీవీ ప్రశంసల జల్లులు కురిపించారు. సూపర్ స్టార్, మెగాస్టార్, బాహుబలి లెవల్ లో అడుక్కోవడం వల్లే ఇది జరిగిందని కామెంట్ చేసిన ఆర్జీవీ.. ఈ సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలుడు వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు. జగన్ ఓ ఒమెగా స్టార్ అని.. ఇండస్ట్రీ ఇబ్బందులపై ఆయన స్పందించిన తీరును మెచ్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించినందుకు జగన్ కు థ్యాంక్స్ చెప్పారు. భవిష్యత్ దిశగా దూసుకెళ్లేలా సినీ ఇండస్ట్రీకి మార్గం సుగమం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.

కాగా, సినిమా టికెట్ ధరల పెంపు, భారీ బడ్జెట్ చిత్రాలకు రాయితీలు లాంటి పలు అంశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సినీ ప్రముఖులు గురువారం చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలీకృతమైనట్లేనని సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో వెల్లడించారు. చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి లాంటి సినీ ప్రముఖులు.. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జగన్ కు వివరించారు. వీటి గురించి చర్చించిన తర్వాత ఐదో షోకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. ఇండస్ట్రీని వైజాగ్ షిఫ్ట్ చేయాలని.. అందుకు అవసరమైన భూములతోపాటు కావాల్సిన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాన్ని తమ సర్కారు అందిస్తుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

అప్పుడు ఉద్యమకారుల్లా... ఇప్పుడు ఉగ్ర‌వాదుల్లా కనిపిస్తున్నారా?

నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతాను

తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే..