తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే.. 

తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే.. 

హైదరాబాద్: తెలంగాణలో చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. తెలంగాణ ఇచ్చిన వారికైనా.. తెలంగాణ తెచ్చిన వారికైనా ఆ పుణ్యం దక్కాలంటే రాష్ట్రంలో చావులు లేకుండా చూడాలన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారికైనా, ఎవరికైనా తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే.. సాధించిన తెలంగాణాలో చావులు లేకుండా చూడాలని ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టించుకోని వారు.. తెలంగాణ ఎలా ఏర్పడిందని కొట్టుకు చస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల చావుల గురించి కొట్లాడే వారు ఎవరని మీడియాకు రిలీజ్ చేసిన ఓ ప్రెస్ నోట్ లో షర్మిలప్రశ్నించారు. 

‘ఈరోజు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నవారు రైతులు చనిపోతే ఎక్కడపోయారు? ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే వీళ్ల సోయి ఎక్కడ పోయింది? ఉద్యమకారులను తొక్కిపెట్టినప్పుడు.. అమరుల ఆత్మబలిదానాల మీద పదవులెక్కి హామీలతో ప్రజలను మోసం చేస్తున్నప్పుడు ఎక్కడ దాక్కున్నారు? తెలంగాణలో చావుల ట్రాక్ ను పక్కదారి పట్టించేందుకు.. ఈ రోజు బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా తప్ప.. ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటీ లేదు. తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్న కేసీఆర్ లా.. బీజేపీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టి అమాయకులైన తెలంగాణ ప్రజలను బలిచేసే రాజకీయ క్రీడ మొదలుపెట్టింది’ అని షర్మిల పేర్కొన్నారు. డ్రామాలు పక్కన పెట్టి.. రాష్ట్రంలో చనిపోతున్న రైతుల, నిరుద్యోగుల చావులు ఆపాలన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతాను

యాప్‌లు ఇచ్చే లోన్లపై త్వరలో గైడ్‌లైన్స్‌

మేడారం పోవడం వీలైతలేదా ?