యూపీ ఎన్నికల ప్రచారానికి సీఎం మమత

యూపీ ఎన్నికల ప్రచారానికి సీఎం మమత

యూపీలో ఎన్నికల వేడి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఐదు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 10న ఫలితాలు కూడా రానున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నేతలంతా ఇప్పుడు యూపీ పైనే ఫోకస్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం... యూపీలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తతున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కూడా ప్రచారంలో జోరు పెంచాయి. పార్టీలకు చెందిన పెద్ద లీడర్లంతా రంగంలోకి దిగి ఎన్నికలను మరింత వాడి వేడిగా మార్చుతున్నారు. 

తాజాగా యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. అకిలేశ్ కోసం స్వయంగా ఆమె రంగంలోకి దిగుతున్నారు. 2022, మార్చి 02వ తేదీ వారణాసికి మమత రానున్నారు. సాయంత్రం నిర్వహించే గంగా హారతిలో పాల్గొననున్నారు.  కోల్‌కతా విమానాశ్రయంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ అఖిలేష్ కోసం ప్రచారం చేయడానికి తాను వారణాసికి వెళ్తున్నానన్నారు. గుడికి వెళ్తానున్నాను అన్నారు. ప్రజల ఆశీర్వాదం తీసుకుని యూపీకి వెళ్తున్నానని మమత ఈ సందర్భంగా చెప్పారు. గంగా నదిపై ప్రధాన ఘాట్ గా పిలిచే.. దశాశ్వమేధ ఘాట్ ను మమత సందర్శించనున్నారు. రెండు రోజుల పాటు యూపీలో పర్యటించనున్న సీఎం మమతా బెనర్జీ.. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారని సమాచారం.