దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’. అన్విష హీరోయిన్. మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మించారు. జూన్ 12న సినిమా విడుదల కానుంది. సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అని దుర్గా దేవ్ నాయుడు అన్నాడు. బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రం రూపొందిందని హీరోయిన్ అన్విష చెప్పింది. నిర్మాత కేదార్‌నాథ్ మాట్లాడుతూ ‘తండ్రీ-కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా దర్శకుడు దుర్గా దేవ్ నాయుడు తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
