జగిత్యాల అభివృద్ధి కోసమే పార్టీ మారాను : ఎమ్మెల్యే సంజయ్ బాబు

జగిత్యాల అభివృద్ధి కోసమే పార్టీ మారాను : ఎమ్మెల్యే సంజయ్ బాబు

 బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. జగిత్యాల నూకపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఎమ్మెల్యే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మౌలిక వసతుల  కోసం రూ. 80 కోట్లు కావాలని నిధుల కేటాయింపు కొరకు సీఎంను కలసానని చెప్పారు. 

అప్పుడే ఆయన తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. మౌలిక వసతులు నియోజకవర్గర అభివృద్ధి అవసరమయ్యే నిధులు విడుదల చేస్తానని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. తన వ్యక్తిగత అవసరాలకే పార్టీ మారారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మొద్దని సూచించారు సంజయ్ కుమార్.