ఎన్టీఆర్ను అలా పిలవడం నాకు నచ్చలేదు.. నటుడు పృథ్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఎన్టీఆర్ను అలా పిలవడం నాకు నచ్చలేదు.. నటుడు పృథ్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్‌లో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR) పై నటుడు పృథ్వీరాజ్(Pritvi raj) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ను అలా పిలవడం తనకు నచ్చదంటూ తన అభిప్రయాన్ని చెప్పారు. ప్రస్తుతం పృథ్వీ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

ఇంతేకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టైన విషయం తెలిసిందే. ఈ విషయంపై దాదాపు నందమూరి కుటుంబ సభ్యులందరూ స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించకపోగా.. తన సినిమా పనులేవో చేసుకుంటూ సైలెంట్ గా ఉన్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనపై విమర్శలు గుప్పించారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాటుడు పృథ్వీరాజ్ ఎన్టీఆర్‌పై వస్తున్న విమర్శలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు... ఎన్టీఆర్ ఈ విషయంపై ఇప్పుడు స్పందించకపోవచ్చు కానీ.. సమయం వచ్చినప్పుడు తప్పకుండ స్పందిస్తారనుకుంటున్నాను. అయితే టీడీపీలో పెద్దలు ఉన్నారు అనే కారణంతోనే ఈ విషయంపై ఆయన మాట్లాడలేదు అని నేను అనుకుంటున్నానన్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడంపై స్పందిస్తూ.. ఆయనను అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు కానీ.. నాకు మాత్రం అలా పిలవడం నచ్చదు. ఆయనని నందమూరి తారక రామారావు అని పిలిస్తేనే నచ్చుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌పై పృథ్వీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.