రాజు గెటప్ అనగానే నేను సరిపోతానా అని అనుమానమేసింది

రాజు గెటప్ అనగానే నేను సరిపోతానా అని అనుమానమేసింది

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కె.హరికృష్ణ నిర్మించారు. ఈ నెల 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ రామ్ కాసేపు ఇలా ముచ్చటించారు. 

  • ‘మహానాయకుడు’ షూటింగ్ టైమ్‌‌‌‌‌‌‌‌లో వశిష్ట నన్ను అప్రోచ్ అయ్యాడు. ‘కథ చెబుతాను. కానీ లాజిక్స్ అడగొద్దు, ఇందులో మేజిక్కే ఉంటుంది’ అన్నాడు. స్టోరీ చాలా ఎక్సైట్ చేయడంతో వర్క్ స్టార్ట్ చేశాం. 
  • నేనెప్పుడూ కథను చూస్తాను తప్ప దర్శకుడికి అనుభవం ఉందా అని చూడను. ‘అతనొక్కడే’ తీసినప్పుడు సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి స్థాయికి అది పెద్ద సినిమానే. కానీ కంటెంట్‌‌‌‌‌‌‌‌ని నమ్మి తీశాం. ఇదీ అంతే. 
  • బయట ఎక్కువగా కనిపించని అగ్రెసివ్‌‌‌‌‌‌‌‌ నేచర్ నాలో ఉంటుంది. దాన్ని ఇందులో ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోర్ చేయగలిగాను. రాజు గెటప్ అనగానే నేను సరిపోతానా అని అనుమానమేసింది. రాజు అంటే ఇలాగే ఉండాలని
  • ‘బాహుబలి’తో ప్రభాస్ ఓ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేశారు కనుక కంపారిజన్స్ ఉంటాయి. అందుకే ఏం చేయాలి అని ఆలోచించి, ముందుగా నా మేకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టాను. గెటప్‌‌‌‌‌‌‌‌ విషయంలో చాలా వర్క్ చేశాం. 
  • ‘బాహుబలి’ని రిఫరెన్స్‌‌‌‌‌‌‌‌గా చెప్పానే తప్ప దానితో ఎలాంటి సంబంధం లేదు. వార్ సీన్స్ అస్సలు లేవు. ఇదంతా బింబిసార అనే రాజు స్టోరీ. చెడ్డవాడైన రాజు మంచివాడు ఎలా అయ్యాడనేదే మా కథ. సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్. తాతగారి పాత్రల రిఫరెన్సులంటే నాకు భయం. నా లిమిట్స్ నాకు తెలుసు. ఆయన్ని నేనెప్పటికీ అందుకోలేను.  ఆ కంపారిజనే నా వల్ల కాదు. ఆయన సినిమాలు రీమేక్ చేయాలన్నా నా స్థాయి సరిపోదు. ‘పాతాళభైరవి’ నాకెంతో స్ఫూర్తినిచ్చిన చిత్రం. ఆ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాబాయి ‘భైరవ ద్వీపం’ చేసినప్పుడు భలేగా బ్లెండ్ చేశారే అనిపించింది. అలాంటి సినిమాలు అందరికీ నచ్చుతాయి. కానీ నేను రీమేక్ చేయలేను. 
  • రొమాంటిక్ సీన్స్ ఉండవు. అసలు నేను రొమాంటిక్ సినిమాలు చేయను. ఆ విషయంలో నాకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. వాటికి నేను సెట్టవననే క్లారిటీ నాకుంది. ఇలాంటి సినిమాలకు పెద్ద హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ని ప్రేక్షకులు ఎక్స్‌‌‌‌‌‌‌‌పెక్ట్ చేస్తారనేది తప్పు. సినిమా విషయంలో చిన్నా పెద్దా అని నేను నమ్మను. ఈరోజు పెద్ద అనుకునే స్టార్స్ అంతా ఒకప్పుడు చిన్నవాళ్లే. క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కి, బడ్జెట్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టుగా ఉంటే చాలు. 
  • మనకున్న ఏకైక ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్ సినిమానే. మంచి సినిమా తీసి, అందుకు తగ్గ కంటెంట్‌‌‌‌‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వస్తారు. వాళ్లకి సినిమా నచ్చితే మౌత్‌‌‌‌‌‌‌‌ పబ్లిసిటీతోనే పెద్ద హిట్టవుతాయి. ఇటీవల వచ్చిన మేజర్, విక్రమ్ చిత్రాలే ఇందుకు ఉదాహరణ. కంటెంట్ బాగుంటే ల్యావిష్‌‌‌‌‌‌‌‌నెస్ కూడా అక్కర్లేదు. మా కంటెంట్‌‌‌‌‌‌‌‌ విషయంలోనూ అలాంటి పాజిటివ్‌‌‌‌‌‌‌‌ వైబ్స్ వచ్చాయి. 
  • నేను, బాబాయి, తారక్.. మా కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో మల్టీస్టారర్ వస్తుందా అని చాలా ఈజీగా అడుగుతుంటారు. మంచి కథ వస్తే చేస్తామంటూ రొటీన్‌‌‌‌‌‌‌‌ ఆన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేను ఇవ్వను. ఎందుకంటే అదంత ఈజీ కాదు. ఇద్దరు స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. అది కూడా రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ పూనుకుంటే అయింది. పైగా మల్టీస్టారర్ అనగానే ఎక్స్‌‌‌‌‌‌‌‌పెక్టేషన్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో పెరుగుతాయి. కాకపోతే మా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాబాయితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి స్టోరీ చెప్పించాను. మాకు నచ్చిన కథలు ఆయనకు నచ్చాలని లేదు కదా. అందుకే కుదరలేదు. అందుకు తగ్గ కథ రావాలి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతి నటుడికీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ప్రెజర్ ఉంటుంది. పైగా తారక్‌‌‌‌‌‌‌‌ ‘ఆర్ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లాంటి ప్యాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. కనుక ఆ ప్రెజర్ ఇంకా ఎక్కువ. మరోవైపు దర్శకుడికి, నిర్మాతలుగా మాకు ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. మాక్కూడా త్వరగానే స్టార్ట్ చేయాలని ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గ సినిమా ఇవ్వడం కోసమే ఈ ఆలస్యం.