ఇర్ఫాన్‌ పఠాన్‌తో 5 ఏళ్లు డేటింగ్‌లో ఉన్నా.. గంభీర్ నా వెంట పడేవాడు: బాలీవుడ్ న‌టి

ఇర్ఫాన్‌ పఠాన్‌తో 5 ఏళ్లు డేటింగ్‌లో ఉన్నా.. గంభీర్ నా వెంట పడేవాడు: బాలీవుడ్ న‌టి

హీరోయిన్లతో క్రికెటర్లు చెట్టా పట్టాలేసుకొని తిరగడం ఎంత కామనో.. తిరిగినన్నీ రోజులు తిరిగి చివరకు ఆ రహస్యాలను నలుగురిలో పెట్టడం హీరోయిన్లకు అంతే కామన్. నటీమణులతో డేటింగ్ యవ్వారాలు నడిపిన మన భారత క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఈ జాబితా భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నుంచి మొదలుపెడితే మహేంద్ర సింగ్, విరాట్ కోహ్లీ వరకూ చాంతాడంత ఉంది. తాజాగా, టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో ఐదేళ్లు ప్రేమాయణం నడిపాడంటూ బాలీవుడ్ న‌టి పాయ‌ల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసింది.

ఇర్ఫాన్ పఠాన్‌తో ఐదేళ్ల పాటు తాను డేటింగ్ చేశానంటూ బాంబు పేల్చిన పాయల్ ఘోష్.. ఆ సమయంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్ ఇస్తూ వేధించేవాడ‌ని ఆరోపించింది. ఆ విషయం ఇర్ఫాన్‌కు కూడా తెలుసని చెప్పుకొచ్చింది. ఈ ఆరోపణలన్నింటిని ఆమె ట్వీట్ల రుపంలో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.  

"నేను ఇర్ఫాన్‌ పఠాన్ తో ప్రేమ‌లో ప‌డ్డాను.. 2011 నుంచి ఐదేండ్ల పాటు అతనితో డేటింగ్ చేశాను. ఆ సమయంలో గౌతం గంభీర్, బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ నా వెంట ప‌డేవారు. గౌతీ మిస్డ్ కాల్స్ ఇస్తూ విసిగించేవాడు. ఆ విష‌యం ఇర్ఫాన్‌కు తెలుసు. ఎలాగంటే.. అత‌డు నా కాల్ లిస్ట్‌ను త‌ర‌చూ చెక్ చేస్తుండేవాడు. ఈ విష‌యం గురించి అత‌డు యూసుఫ్ ప‌ఠాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో చర్చించేవాడు.." అని పాయ‌ల్ ట్వీట్ చేసింది.

ఇర్ఫాన్‌తో తన బంధం తెగిపోయాక తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని పాయల్ వెల్లడించింది. ఈ విషయాన్ని కూడా ట్వీట్లలో ప్రస్తావించింది. ఈ కారణంగా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యానని తెలిపింది. జీవితంలో తాను ప్రేమించిన ఏకైక వ్యక్తి ఇర్ఫాన్ మాత్రమే అని, ఆ తరువాత మరెవరినీ ప్రేమించలేదని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారత క్రికెటర్లను అవమానించాలనే ఉద్దేశ్యంతోనే పాయల్ ఈ ఆరోపణలు చేసిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.