బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. అడివి శేష్‌కు జంటగా నటించిన ఈ చిత్రాన్ని షానియల్ డియో దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఏప్రిల్ 10న తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ చెప్పిన విశేషాలు.
‘‘సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయిలా ఆదరించారు. నాకు ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్ చేయాలని ఉంటుంది. అలాగే నాకు నేనే సర్‌ప్రైజ్ అవ్వడం ఇష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన సినిమా ఇది. -కథ విన్నప్పుడే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇందులో సరస్వతి అనే డిఫికల్ట్ క్యారెక్టర్ చేశా. నా కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇందులో కొన్ని స్టంట్స్ కూడా చేశా.
చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశా. శేష్‌తో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. రైటింగ్, డైరెక్షన్.. అన్నిట్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇది ఆయన బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా ఉంటుంది. -ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో షూట్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులోని విజువల్స్ హాలీవుడ్ స్టైల్‌లో ఉంటాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ గారితో వర్క్ చేయడం నైస్ ఎక్స్‌పీరియెన్స్’’.
