క్రిమినల్​ కేసు పెట్టినా రైతులకే మద్దతిస్త

క్రిమినల్​ కేసు పెట్టినా రైతులకే మద్దతిస్త
  • ఎఫ్ఐఆర్​ నమోదైందనే వార్తలపై గ్రెటా థన్​బర్గ్​ కామెంట్

న్యూఢిల్లీ: పోలీసులు తనపై కేసులు పెట్టినా సరే తాను మాత్రం రైతులకే మద్దతిస్తానని స్వీడిష్ క్లైమేట్​ యాక్టివిస్ట్​ గ్రెటా థన్​బర్గ్​ గురువారం స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసులు గ్రెటాపై క్రిమినల్​ కేసు పెట్టారని గురువారం ప్రచారం జరిగింది. గ్రెటా చేసిన ట్వీట్లు నేరపూరిత కుట్ర, శతృత్వాన్ని సపోర్ట్‌‌‌‌ చేసేలా ఉన్నాయని కేసు పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఐపీసీ 120-బీ, 153-ఏ సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్‌‌‌‌ చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి ట్వీట్‌‌‌‌ చేశారు. ‘నేను ఇప్పటికీ రైతుల పక్షానే ఉన్నాను. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు ఇస్తున్నాను. ద్వేషం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు నా డెసిషన్‌‌‌‌ను మార్చలేవు’ అని ట్వీట్‌‌‌‌ చేశారు. రైతులకు ఎలా మద్దతు ఇవ్వాలో తెలిపే ‘టూల్‌‌‌‌కిట్‌‌‌‌’ను ఆమె షేర్ చేశారు.

ఎఫ్ఐఆర్​లో గ్రెటా పేరులేదు..

గ్రెటా థన్​బర్గ్​పై కేసు నమోదైందన్న వార్తలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.. ఎఫ్ఐఆర్​లో ఎవరి పేర్లూ పేర్కొనలేదని డీసీపీ రాజన్​ చెప్పారు. ట్విట్టర్​ టూల్​ కిట్​ తయారుచేసిన వారిపై కేసు పెట్టిన మాట నిజమేనని ఆయన వివరించారు. అయితే, అందులో థన్​బర్గ్​ పేరులేదన్నారు.