ఇన్ కం ట్యాక్స్ ఉద్యోగికే టోకరా.. 5 రూపాయలతో లక్ష కొట్టేశారు

ఇన్ కం ట్యాక్స్ ఉద్యోగికే టోకరా.. 5 రూపాయలతో లక్ష కొట్టేశారు

ఓ ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగి ఆన్ లైన్ మోసానికి బలైపోయాడు. తన బ్యాంకు ఖాతా నుంచి రూ.98వేల 5వందలను పోగొట్టుకున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన నిశాంత్ కుమార్ స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తూ సెంట్రల్ రిజర్వ్ క్వార్టర్ట్స్ లో ఉంటున్నాడు. నవంబర్ 11న దీపావళి కోసం కోల్ కతా నుంచి స్వీట్ల ఆర్డర్ కోసం కొరియర్ చేసినట్టు అతని బావ నిశాంత్ కుమార్ తెలిపినట్టు పోలీసులు చెప్పారు.

నవంబర్ 13 వరకు కూడా పార్శిల్ అందకపోవడంతో కస్టమర్ కేర్ సిబ్బందికి కాల్ చేయగా.. పార్శిల్ ను ట్రాక్ చేయడానికి రూ.5 ట్రాన్స్ఫర్ చేయమని సూచించారు. దీంతో మూడు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ లో అతని ఖాతా నుంచి రూ,98వేల 500కాజేశారు. ఫిర్యాదు అనంతరం ఈ ఘటనపై తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు.