Anushka Shetty : ప్రభాస్ పై మనస్సులోని మాట బయటపెట్టిన అనుష్క.. ఏం చెప్పిందంటే?

Anushka Shetty : ప్రభాస్ పై మనస్సులోని మాట బయటపెట్టిన అనుష్క.. ఏం చెప్పిందంటే?

సినీ ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకులలో ఒక సరికొత్త వైబ్రేషన్ కనిపిస్తుంది. అటువంటి మ్యాజికల్ కాంబినేషన్లలో ముందు వరుసలో ఉంటుంది ప్రభాస్, అనుష్కల జోడీ.  దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్ లో వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఒక లెజెండ్‌గా నిలిచిపోయింది. అంతకుముందు 'బిల్లా' ( 2009 ), ‘మిర్చి’ (2013) లో కూడా వీరి జంటను ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. ఈ విజయవంతమైన కలయికల తర్వాత, అభిమానులు మరోసారి వీరిద్దరూ కలిసి నటించే సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంటుంది.

ఫుల్ బిజీగా ప్రభాస్, అనుష్క
ప్రస్తుతం, ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేతిలో కల్కి 2, హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా, ‘సలార్: పార్ట్ 2’, సందీప్ వంగ రూపొందిస్తున్న ‘స్పిరిట్’, అలాగే 2026 జనవరిలో విడుదల కానున్న ‘ది రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు, అనుష్క శెట్టి నటించిన ‘ఘాటి’ సినిమా సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది.  

మళ్లీ ప్రభాష్ తో నటించాలని ఉంది..
ఈ నేపథ్యంలో 'ఘూటి' మూవీ ప్రమోషన్స్ జోరందుకుంది. అయితే ఈ ప్రమోషన్స్ లో  అనుష్క డైరెక్ట్ గా పాల్గొనడం లేదు. కానీ మీడియాకు ఫోన్ కాల్స్ ఇంటర్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా పాన్ ఇండియా సూపర్ ప్రభాస్ తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధామిచ్చారు.  నేను కూడా ఎదురుచూస్తున్నా.. ప్రభాస్ తో మళ్లీ కలిసి నటించాలని ఉంది. అయితే బహుబలి లాంటి మూవీ తర్వాత అది ప్రత్యేకంగానో, డిఫరెంట్ గానో  ఉండాలి. మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాం.  ప్రభాస్ కు నచ్చితే చేస్తామని బదులిచ్చారు స్వీటీ . అనుష్క వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.

బాహుబలి: ది ఎపిక్ రిలీజ్.. 
మరోవైపు  ప్రభాస్-అనుష్కల అభిమానులకు మరో డబుల్ ట్రీట్ రాబోతోంది. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రాన్ని అక్టోబర్ 31న పాన్-ఇండియా స్థాయిలో మళ్ళీ విడుదల చేయబోతున్నారు. బిగ్ స్క్రీన్ పై ఆ అద్భుతమైన విజువల్స్, అమోఘమైన నటన,  వీరిద్దరి కెమిస్ట్రీని మరోసారి చూసే అవకాశం రావడం అభిమానులలో సంతోషం నింపింది.

ALSO READ : ‘మదరాసి’కి క్రేజీ బిజినెస్..

ఇక అనుష్క నటించిన ‘ఘాటి’ సినిమా విషయానికొస్తే, ఇది ఒక థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా. గిరిజ‌న నేప‌థ్యంలో సాగే ఈ క‌థలో, ఒక నిస్సహాయ గిరిజన ప్రాంతం ఎలా డ్రగ్ మాఫియాలో చిక్కుకుంటుందో చూపిస్తారు. ఈ చిత్రానికి డెరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జగపతి బాబు, చైతన్య రావు, రవీంద్ర విజయ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, జాతీయ అవార్డు గ్రహీత తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ అందిచాంరు. మరి బాక్సాఫీస్ వద్ద 'ఘాటి' అభిమానులు  ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.