V6 News

పెళ్లికి ముందే గర్భం దాల్చా.. అందుకే అర్జంటుగా పెళ్లి చేసుకున్నాం.. ప్రెగ్నెన్సీపై నోరు విప్పిన బాలీవుడ్ నటి!

పెళ్లికి ముందే గర్భం దాల్చా.. అందుకే  అర్జంటుగా పెళ్లి చేసుకున్నాం.. ప్రెగ్నెన్సీపై నోరు విప్పిన బాలీవుడ్ నటి!

బాలీవుడ్ నటి నేహా ధుపియా సినీప్రియులకు సుపరిచితమే. హిందీ చిత్రాల్లోనే కాదు తెలుగులోనూ నటించి ప్రేక్షకులను మెప్పింది. అయితే 2018లో నటుడు అంగద్ బేడీతో ఆమె వివాహం బాలీవుడ్ వర్గాల్లో అప్పట్లో అదొక పెద్ద సంచలనం..  ఈ జంట ప్రేమలో ఉన్నారన్న సంగతి బయట ఎవరికి పెద్దగా తెలియదు. అంతే కాదు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, కేవలం అత్యంత సన్నిహితుల మధ్య గురుద్వారాలో వీరి పెళ్లి జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పెళ్లయిన ఆరు నెలలకే వీరిద్దరికీ కూతురు మెహర్ జన్మించడంతో, వీరి ప్రేమాయణంపై అనేక గుసగుసలు వినిపించాయి.  లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ జంట తమ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎనిమిదేళ్ల ప్రేమ!

అంగద్ బేడీకి నేహాపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. ఆమె కోసం దాదాపు 8 ఏళ్ల పాటు వెంట పడ్డారు. అన్ని సంవత్సరాలు పాటు తిరుగుతున్నా.. ఆమె మాత్రం ఎప్పుడూ 'యస్' చెప్పలేదు. తను తన పనిలో చాలా బిజీగా ఉండేది అని అంగద్ గుర్తుచేసుకున్నారు. తొలిసారి నేహాని  జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతుంటే చూసి ఫిదా అయిపోయాను. ఆమె రన్నింగ్ ఫామ్ చూసి, తను ఒక  అథ్లెట్ అనిపించింది. ఆ క్షణమే తనతో ప్రేమలో పడ్డాను అని పాత జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు.

కెరీర్ వైపే చూపు

నేహా దృష్టి అప్పట్లో కేవలం తన వృత్తిపైనే ఉండేది. నాకు అప్పుడు కేవలం పని, వ్యాయామం.. ఇదే ప్రపంచం. ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉండాలని నేను అనుకోలేదు. ఆ ప్రయాణంలో ఎవరైనా ఆసక్తికరమైన వ్యక్తి తారసపడితే సరే, లేదంటే లేదు అన్నట్లు ఉండేదాన్ని అని నేహా వివరించారు. అంగద్ ఆమె మనసు గెలవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆమెతో కలిసి ఒక సినిమాలో నటించడానికి కూడా సిద్ధపడ్డారు. చివరికి ఆమె తల్లిదండ్రులను కలిసి ఒప్పించినా, నేహా మాత్రం అంగద్‌ను కేవలం ఒక స్నేహితుడిగానే చూస్తూ పక్కన పెట్టిందని గుర్తుచేసుకున్నారు.

గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి..

వృత్తిరీత్యా స్నేహితులుగా ఉన్న వీరిద్దరి జీవితాలను ప్రెగ్నెన్సీ పూర్తిగా మార్చేసింది. నేహా గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.  నేను గర్భవతి కావడం వల్లే పెళ్లి చేసుకున్నాం. ఆ బిడ్డే మా ఇద్దరినీ దగ్గరకు చేర్చింది. దేవుడే మాకు ఆ వరాన్ని ఇచ్చాడు, లేదంటే మేము ఇంకా ఎక్కడెక్కడో వెతుక్కునే వాళ్లం అని నేహా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పెళ్ళికి ముందే గర్భవతిని. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అప్పటికే మేము డేటింగ్ ప్రారంభించి కొద్దికాలమే అయ్యింది. ఆ సమయంలో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం చాలా కష్టమైన పని. అందుకే నా స్నేహితురాలు సోహా అలీ ఖాన్‌కు ముందుగా ఈ విషయం చెప్పాను నేహా అని గుర్తుచేసుకున్నారు.

హ్యాపీ ఫ్యామిలీ

ప్రస్తుతం నేహా, అంగద్ దంపతులకు మెహర్, గురిక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంగద్ తన ప్రయారిటీ లిస్ట్ గురించి జోక్ చేస్తూ.. నేహా లిస్టులో తనకు ఐదవ స్థానం అని, మొదట పిల్లలు, తర్వాత పని, తల్లిదండ్రులు ఉంటారని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ కెరీర్ ఆశాజనకంగా సాగుతోందని చెప్పుకోచ్చారు ఈ జంట.  పెళ్లి విషయంలో ఎదురైన విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని, సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా తనదైన శైలిలో జీవితాన్ని గడుపుతున్నారు..