ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తా.. టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా గెలుస్తం: తిలక్‌‌‌‌‌‌‌‌

ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తా.. టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా గెలుస్తం: తిలక్‌‌‌‌‌‌‌‌

ధర్మశాల: మ్యాచ్‌‌‌‌‌‌‌పరిస్థితులను బట్టి ఎక్కడైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు చాలా మంది బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారని టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ అన్నాడు. తాను ఏ ప్లేస్‌‌‌‌‌‌‌‌లోనైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు. ‘ఓపెనర్లు మినహా మిగతా వారందరూ అన్ని ప్లేస్‌‌‌‌‌‌‌‌లకు సరిపోతారు. నేను 3,4, 5 లేదా 6వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు రెడీ. ఒక నిర్దిష్ట ఎత్తుగడ వ్యూహాత్మకంగా ఉత్తమమని అనిపిస్తే దానినే అనుసరిస్తాం. 

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్లేయర్లు కూడా రెడీగా ఉన్నారు’ అని తిలక్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. ధర్మశాలలో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పిచ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ‘నేను ఇంతకుముందు ఇక్కడ అండర్‌‌‌‌‌‌‌‌–19 సిరీస్‌‌‌‌‌‌‌‌లు ఆడా. అప్పట్నించి వికెట్‌‌‌‌‌‌‌‌ను గమనిస్తున్నాం. ఈ పిచ్‌‌‌‌‌‌‌‌పై అధిక స్కోరింగ్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని అనుకుంటున్నా. తక్కువ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ వల్ల ప్రారంభంలో బౌలర్లకు కాస్త సాయంగా ఉండొచ్చు.

టాస్‌‌‌‌‌‌‌‌ మా చేతుల్లో లేదు. మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి మేం సిద్ధంగా ఉన్నాం. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ఆర్డర్‌‎లో మార్పులు పెద్దగా ప్రభావం చూపబోవనే అనుకుంటున్నాం. జట్టు కోసం ఏం చేయగలనో దాని గురించే ఆలోచిస్తా’ అని తిలక్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు. రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓడినా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ను కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామన్నాడు.