రాజకీయంగా, సాంకేతికపరంగానే కేసీఆర్​కు జవాబిస్తాం

రాజకీయంగా, సాంకేతికపరంగానే కేసీఆర్​కు జవాబిస్తాం

న్యూఢిల్లీ, వెలుగు: ఇకపై సీఎం కేసీఆర్​ను పరుష పదజాలంతో విమర్శించనని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. ఇవేమీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నవి కాదని, ఆవేదనతో చెప్తున్నానని అన్నారు. రాజకీయంగా, సాంకేతిక పరంగా మాత్రమే కేసీఆర్​కు జవాబిస్తామని ఆయన సోమవారం ఒక వీడియోను విడుదల చేశారు. పిల్లలందరినీ కేసీఆర్ రాజకీయాల్లోకి తెచ్చారని, ఇంట్లో వారసత్వ పోరు మొదలైందని అన్నారు. బీజేపీ ఎక్కడ ఎదుగుతుందనో, టీఆర్ఎస్ దిగజారుతుందనో.. లేక వారసత్వ ప్రెజర్ తోనో కేసీఆర్ మానసిక పరిస్థితి దిగజారుతోందని అన్నారు. తెలంగాణపై విదేశాలు కుట్ర పన్ని క్లౌడ్ బరస్ట్ చేయడంతో వరదలు సంభవించాయన్న కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే బాధేస్తోందన్నారు. ఇవన్నీ ఆయన మానసిక పరిస్థితిని తెలుపుతున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీగా ఓటు వేసే హక్కును కల్పించిన నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.