తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మీనాక్షి చౌదరి.. ఇప్పుడు ‘వృషకర్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చెప్పిన విశేషాలు.
‘‘ఈ చిత్రంలో దక్ష అనే ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తా. తను ఫోకస్డ్గా ఉండే అమ్మాయి. ఆర్కియాలజీలో థీసిస్ చేస్తుంటుంది. ఈ పాత్ర కోసం నాగచైతన్యతో కలిసి రెండు రోజుల పాటు వర్క్‌షాప్ చేశా. ఆర్కియాలజీకి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ పాత్రకు మంచి గ్రాఫ్ ఉంటుంది. నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. కానీ ఈ సినిమాలో అలాంటి ఛాలెంజింగ్ సీక్వెన్స్‌లు ఉన్నాయి.
చాలా ధైర్యంగా వాటిని పూర్తి చేశాను. భారీ స్థాయిలో సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండటం కూడా నాకు కొత్త అనుభూతినిచ్చింది. నాగచైతన్యతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆయన గ్రౌండెడ్‌గా, హంబుల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారు. కార్తీక్ దండు విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన రూపొందించిన ‘విరూపాక్ష’ తరహాలోనే ఇది కూడా కంటెంట్ బేస్డ్ మూవీ.
అదే సమయంలో కమర్షియల్ అంశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక నటిగా ప్రతి సినిమాలోనూ కొత్త తరహా పాత్రలు చేయాల నుకుంటాను. ఒకే జానర్లో, ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. కథలో, క్యారెక్టర్లో కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తాను. ప్రస్తుతం కార్తితో ఓ సినిమా, అలాగే హిందీ, తమిళంతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా ”.
