చిరంజీవి సినిమా తీసి నేను దివాలా తీయలే..అనిల్ సుంకర?

చిరంజీవి సినిమా తీసి నేను దివాలా తీయలే..అనిల్ సుంకర?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ (Bhola Shankar). స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించారు. ఈ మూవీ రిలీజ్ ఆయిన ఫస్ట్ షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా..రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన తక్కువ కలెక్షన్స్ రాబడుతుంది. 

దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన భోళా శంకర్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పేరు వినిపిస్తోంది. ఈ మూవీ కోసం అనిల్ సుంకర ఏకంగా తన ఆస్తులు తాకట్టు పెట్టాడని, చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోవడంలో ఒత్తిడి కలిగిస్తున్నడని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అనిల్ సుంకర.. చిరంజీవి స్టామినా ఏంటో తెలుసు..చిరుకు తగ్గ స్టోరీ పడితే ఏ రేంజ్ లో హిట్ అవుతుందో తెలిసింది. మరో మూవీ తీసేందుకు కూడా నేను ఎప్పుడు అన్నయ్య కోసం రెడీ. అసలు భోళా శంకర్ మూవీతో నేను దివాల తీశానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. తనపై వస్తున్న వార్తలు జస్ట్ పబ్లిక్ స్టంట్స్ మాత్రమే ..అని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పేర్కొన్నట్లు న్యూస్ వినిపిస్తుంది. 

దీంతో అసలు విషయం కనుక్కోవడానికి ఒక అభిమాని నేరుగా అనిల్ సుంకరకే మెసేజ్ సెండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ చాట్ వైరలైంది. అనిల్ సుంకర పై చేసిన కామెంట్స్ చూపిస్తూ.. సార్..ఇది నిజమేనా? అని ఆ అభిమాని అడిగారు.

తాను అమెరికాకు వెళుతున్నానని అనిల్ రిప్లై ఇచ్చినట్లు మెస్సేజ్ లో ఉండటంతో..అనిల్ సుంకర బ్రేవ్ మ్యాన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తోన్నాయి. 

పుకార్లన్నీ పట్టించుకోవద్దండి..నేను మళ్లీ చిరంజీవిగారితో మరో సినిమా చేస్తాను..ఆయన చాలా మంచివారు..మరో సినిమాతో అయినా సమాధానం చెబుదాం అని.. అనిల్ మెస్సేజ్ చేసినట్లు ఆ స్క్రీన్ షాట్ లో ఉంది. 

భోళా శంకర్ మూవీ విషయానికి వస్తే.. 

విడుదలకు ముందే భోళా శంకర్ టీమ్ భారీ షాక్ తగిలింది. భోళా శంకర్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. భోళా శంకర్ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది.నార్మల్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. దీంతో భోళా శంకర్ కలెక్షన్స్ అంతగా రాలేదు. చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. భోళా శంకర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.30 కోట్ల గ్రాస్, రూ.15 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు సమాచారం. మెగాస్టార్ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటిరోజు రూ.12 కోట్లు కలెక్ట్ చేయగా.. మిగిలిన ప్లేసెస్ లో కలిపి రూ.3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక భోళా శంకర్ సినిమాకు దాదాపు రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి.

కాగా ఈ మూవీకు సంబంధించి ఓటీటీ బిజినెస్ ఇప్పటి వరకు జరగకపోవడంతో ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు భారీ నష్టాలూ రావడం కన్ఫర్మ్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. దీంతో దాదాపు రూ.60 కోట్ల వరకు నష్టాలూ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీ వీకెండ్ కల్లెక్షన్స్ కూడా అంతగా లేకపోవడంతో నష్టాలూ తప్పవంటూ ఫ్యాన్స్ నుండి.. ఇండస్ట్రీ వరకి అనిల్ సుంకర విషయంలో రియాక్ట్ అవుతున్నారు. 

చిరు కి పట్టున్న నైజాంలో మొదటి రోజు భోళా శంకర్ రూ. 4.5 కోట్ల షేర్ అందుకుంది. రెండో రోజు రూ. 1 కోటి. ఇలా రోజు రోజుకి భారీ వసూళ్లు పడిపోయాయి. ఇక భోళా శంకర్ నైజాం హక్కులు రూ. 22 కోట్లకు అమ్మారు. సెకండ్ డేనే 70 శాతం వసూళ్లు పడిపోయాయి. ఎంత మ్యాజిక్ చేసినా భోళా శంకర్ షేర్ రూ. 30 కోట్లు దాటడం కష్టమే. చూస్తుంటే భోళా శంకర్ బయ్యర్లు పెద్ద మొత్తంలో నష్టపోనున్నారు. 

డే1 రూ.16.25 కోట్లు -
డే2వ రోజు రూ.5.05 కోట్లు, -68.92%
డే3వ రోజు రూ.5.1 కోట్లు 0.99%
డే4వ రోజు రూ.2.00 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. 
ఇక ఇండియా వైడ్ ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే రూ.28.40 కోట్లు మాత్రమే చిరు మూవీ కల్లెక్ట్ చేయడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.36.1 కోట్లు సాధించినట్టు తెలుస్తోంది.