పవన్ కళ్యాణ్​ కోసం ‘గాడ్సే’ కథ రాశా!

పవన్ కళ్యాణ్​ కోసం ‘గాడ్సే’ కథ రాశా!

‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డైరెక్టర్ గోపీ గణేష్ రూపొందించిన చిత్రం ‘గాడ్సే’.

సి.కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీ జూన్ 17న విడుదలవుతున్న సందర్భంగా గోపి చెప్పిన విశేషాలు.  

‘‘ఒరిజినల్ గాడ్సేకీ ఈ కథకీ ఎలాంటి సంబంధం లేదు. బొమ్మ తుపాకీతో స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  షూట్ చేయడానికి కూడా ఇష్టపడని సత్య.. సీరియల్ కిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎందుకు మారాడనేది కథ. ప్రస్తుత సమాజంలో మన మధ్య జరుగుతున్న బర్నింగ్ ఇష్యూని చూపించాం. మా ఫ్యామిలీలో దాదాపు ఇరవై ఐదు మంది పిల్లలు నా కళ్లముందే పుట్టి పెరిగారు. అందరూ డిగ్రీలు, పీజీలు చేశారు కానీ ఏ ఒక్కరూ అర్హతకు తగ్గ ఉద్యోగాలు చేయట్లేదు. ఎందుకిలా జరుగుతుందనేది సర్వే చేసి ఈ స్ర్కిప్ట్ రెడీ చేశాను. పుట్టిన ఊరు, జిల్లా, రాష్ట్రంలో ఉద్యోగం రాకపోతే ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. వీటి గురించి ప్రశ్నించడానికే గాడ్సే వస్తున్నాడు. ఇది ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ కాదు, ఆలోచింపజేసే సినిమా. అసలీ కథని పవన్ కళ్యాణ్ గారి కోసం రాసుకున్నా. కానీ ఆయన వరకు రీచ్ అవ్వలేకపోయాను. ఇప్పుడీ సినిమా అయినా ఆయనకు చూపించాలనుకుంటున్నా.  ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు సినిమాల స్ఫూర్తితో దీన్ని తీశాను. నెక్స్ట్ సత్యదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే మరో మూవీ చేయాల్సి ఉంది. ‘బ్లఫ్ మాస్టర్2’ కూడా చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నాం.’’