
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) స్కైడైవ్ ల్యాండింగ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. గురువారం నిర్వహించిన 88వ ఐఏఎఫ్ వ్యవస్థాపక సంబురాల్లో ఈ ఫీట్ నమోదు చేసింది. లేహ్‌లోని ఖర్దుంగ్లా పాస్‌లో 17,982 ఫీట్ల ఎత్తులో స్కైడైవ్ ల్యాండింగ్ చేయడం ద్వారా ఐఏఎఫ్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. సీ-130జే విమానం నుంచి వింగ్ కమాండర్ గజానంద్ యాదవ, వారంట్ ఆఫీసర్ ఏకే తివారీ విజయవంతంగా స్కైడైవింగ్ జంప్ చేశారని డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇది చాలా సవాల్‌తో కూడుకున్నదని, ఆ ఇద్దరు ఎయిర్ వారియర్స్ అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారని మెచ్చుకుంది.