మేలోనే ఇండియాకు మీటియర్స్‌‌‌‌‌‌‌‌?

మేలోనే ఇండియాకు  మీటియర్స్‌‌‌‌‌‌‌‌?

ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఓ పదింటిని పంపాలని ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ను కోరిన ఇండియా

రాఫెల్‌‌‌‌‌‌‌‌ జెట్లతో పాటు అందించాలని వినతి.. ఆలోచిస్తున్న ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌

పాకిస్థాన్‌‌ దగ్గర అమెరికా ఇచ్చిన ‘అమ్‌‌రామ్‌‌’ మిసైళ్లున్నాయి. 75 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈజీగా కొట్టేసే సత్తా ఉన్నవీ మిసైళ్లు. అందుకే వీటిని తలదన్నే ‘మీటియర్స్‌‌’ మిసైళ్లను ఫ్రాన్స్‌‌ నుంచి ఇండియా కొంటోంది. 150 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈజీగా ఛేదించగలవివి. మామూలుగా అయితే 2021లో ఫ్రాన్స్‌‌ వీటిని అందించాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది మే నెల నాటికి ఓ పదింటిని పంపాలని ఫ్రాన్స్‌‌ను ఇండియా కోరింది. వచ్చే మేలో వస్తున్న రాఫెల్‌‌‌‌‌‌‌‌ ఫైటర్‌‌‌‌‌‌‌‌ జెట్లతో పాటే వీటిని అందించాలని అడిగింది. ఇండియా విన్నపాన్ని ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

150 కి.మీ. పరిధి

మీటియర్స్‌‌‌‌‌‌‌‌ బియాండ్‌‌‌‌‌‌‌‌ విజువల్‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌ మిసైళ్లు. ఇవే గనక మనకు అందితే మన చుట్టూ ఉన్న ప్రాంతంలోని అన్ని ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఫోర్సుల కన్నా బలమైన శక్తిగా ఎదగగలుగుతాం. బాలాకోట్‌‌‌‌‌‌‌‌ క్యాంపులపై ఇండియా ఎయిర్‌‌‌‌‌‌‌‌ స్ట్రైక్స్‌‌‌‌‌‌‌‌ తర్వాత పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌కు అమెరికా ‘అమ్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌’ మిసైళ్లను అందించింది. వాటికన్నా ఎక్కువ సామర్థ్యంగలవి, ఈ క్లాస్‌‌‌‌‌‌‌‌కు చెందిన మిసైళ్లలో అత్యద్భుతమైనవి మీటియర్స్‌‌‌‌‌‌‌‌. త్వరలో ‘ఎస్‌‌‌‌‌‌‌‌సీఏఎల్‌‌‌‌‌‌‌‌పీ’ మిసైళ్లను కూడా ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇండియా కొనుగోలు చేయనుంది. వీటి పరిధి 300 కిలోమీటర్లు. వీటి ద్వారా పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌లోని ఏ ప్రదేశాన్నయినా టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు.

ఫస్ట్‌‌‌‌‌‌‌‌ 4 ఫైటర్‌‌‌‌‌‌‌‌ జెట్లు

తొలి 4 రాఫెల్‌‌‌‌‌‌‌‌ ఫైటర్‌‌‌‌‌‌‌‌ జెట్లను వచ్చే మే నాటికి ఇండియా రానున్నాయి.  వీటికి ‘మికా’ మిసైళ్లను తొలుత అమర్చనున్నారు. తర్వాత ‘మీటియర్‌‌‌‌‌‌‌‌’ కు మార్చనున్నారు. యుఏఈలో ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ రాఫెల్‌‌‌‌‌‌‌‌ జెట్స్‌‌‌‌‌‌‌‌ పని చేస్తున్నాయి. వాటి పనితీరు చూడటానికి ఓసారి అల్ ధఫ్రా ఎయిర్‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌కు రావాలని ఐఏఎఫ్‌‌‌‌‌‌‌‌ను ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ కోరింది. ఇరాక్‌‌‌‌‌‌‌‌, సిరియాల్లో కొన్ని ఆపరేషన్లలోనూ  ఈ జెట్స్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నాయి. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ దేశంతో త్వరలో త్రివిధ దళాల విన్యాసాలను ఇండియా జరపబోతోంది.
కరెంట్ చేప.. క్రిస్మస్ లైట్లను వెలిగిస్తది!

అమెరికాలోని టెన్నిసీ అక్వేరియం ఇది. ఫొటోలో చిన్న చిన్న బల్బులు అమర్చిన ఓ క్రిస్మస్ చెట్టు ఉంది కదా. అక్వేరియంలో చేప కదిలినప్పుడల్లా క్రిస్మస్ చెట్టుపై లైట్లు చక్కుమని వెలుగుతున్నాయట. దీనిని చూసేందుకు జనం విపరీతంగా వస్తుండటంతో వైరల్ అయిపోయింది. క్రిస్మస్ లైట్లను వెలిగించే ఈ ఎలక్ట్రికల్ ఈల్ మిగెల్ వాట్సన్. ఇది మామూలుగా 10 వోల్టుల కరెంట్ రిలీజ్ చేస్తుందట. కానీ కోపమొచ్చినా, ఫుడ్ దొరికి ఎక్సైట్ అయినా ఇది ఏకంగా 800  వోల్టుల వరకూ కరెంట్ రిలీజ్ చేస్తుందట. ఆ కరెంట్ నే సెన్సర్ల ద్వారా క్రిస్మస్ లైట్లకు లింక్ చేసి, వాటిని వెలిగిస్తున్నారట. అంతేకాదు.. ఇది కరెంట్ రిలీజ్ చేసినప్పుడల్లా సౌండ్ ఎఫెక్ట్ వచ్చేలా ఏర్పాట్లు కూడా చేశారట.