ఐఏఎస్ శివశంకర్ ఏపీకి కేటాయింపు..ఉత్తర్వులు జారీ చేసిన డీవోపీటీ

ఐఏఎస్ శివశంకర్ ఏపీకి కేటాయింపు..ఉత్తర్వులు జారీ చేసిన డీవోపీటీ

న్యూఢిల్లీ, వెలుగు: ఐఏఎస్ అధికారి శివశంకర్‌‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌‌కు కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం డీవోపీటీ సెక్రటరీ అశ్విని కుమార్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. 2013 బ్యాచ్‌కు చెందిన లోతేటి శివశంకర్ ఏపీలోని విజయనగరం జిల్లా ధర్మవరానికి చెందిన వ్యక్తి కాగా, ఈయన రంగారెడ్డి జిల్లాలో ఉన్న బంధువుల ఇంట్లో ఉండి చదువుకొని, సివిల్స్‌కు ఎంపికయ్యారు. 

అయితే, రాష్ట్ర విభజన తర్వాత యూపీఎస్సీకి చేసిన దరఖాస్తులో తన శాశ్వత చిరునామా రంగారెడ్డి జిల్లాగా పేర్కొనడంతో కేంద్రం ఆయనను తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో తన సొంత రాష్ట్రమైన ఏపీకి తనను కేటాయించాలని ఇటీవల కోర్టును శివ శంకర్ ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు సానుకులంగా తీర్పు ఇచ్చింది. దీంతో కోర్టు ఆదేశాలతో శివ శంకర్‌‌ను తెలంగాణ నుంచి ఏపీకి కేటాయిస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.