ఐబీఎంలో 3,900 ఉద్యోగుల తీసివేత

ఐబీఎంలో 3,900 ఉద్యోగుల తీసివేత

దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. కంపెనీలు ఎప్పుడు, ఏ ఉద్యోగిని తీసివేస్తుందోనని ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సిబ్బంది తీసివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఆ జాబితాలో చేరింది. తాజాగా 3,900 ఉద్యోగులను తీసేయనున్నట్టు వెల్లడించింది. అసెట్ డివెస్ట్ మెంట్ లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ స్పష్టం చేసింది. అయితే క్లయింట్ ఫేసింగ్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ నియామకాల కోసం మాత్రం తాము కట్టుబడి ఉన్నట్టు ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ చెప్పారు.