పైరసీ కేసులో తెలంగాణ CID ఎంట్రీ.. పీకల్లోతు కష్టాల్లోకి iBOMMA రవి !

పైరసీ కేసులో తెలంగాణ CID ఎంట్రీ.. పీకల్లోతు కష్టాల్లోకి iBOMMA రవి !

హైదరాబాద్: తెలుగు సినిమాలను పైరసీ చేసి సొమ్ము చేసుకున్న ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ CID ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ రవి వివరాలను తెలంగాణ CID సేకరించింది. ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ సైట్స్ను iBOMMAలో రవి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులను దర్యాప్తు చేస్తున్న CID.. ఐబొమ్మ రవి బెట్టింగ్ బాగోతంపై కూడా విచారణ చేయాలని నిర్ణయించింది. రవికి సంబంధించిన డేటా కోసం సైబర్ క్రైమ్ పోలీసులను CID ఇప్పటికే వివరాలు అడిగింది. ఇదిలా ఉండగా.. ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతోంది.

శుక్రవారం రెండో రోజు.. విచారణలో రవి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అనేక ప్రశ్నలకు మౌనంగానే ఉన్నట్లు సమాచారం. డబ్బు కోసమే తాను బెట్టింగ్​ప్రమోషన్​ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం వన్ ఎక్స్ బెట్ వన్ విన్ నిర్వాహకులు తనను సంప్రదించారని చెప్పారు. సినిమా వీడియో మధ్యలో బెట్టింగ్ బగ్స్ ప్రమోట్ చేయాలని ఆయనను కోరినట్లు వెల్లడించారు. అయితే, వన్ ఎక్స్ బెట్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం రవి నిరాకరించారు. ఇవాళ కూడా విచారణ కొనసాగుతోంది.

►ALSO READ | Ilayaraja: సోషల్ మీడియాలో స్వరకర్త ఇళయరాజా ఫోటో వాడొద్దు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు