ఐబీపీఎస్ కామన్ ప్రిపరేషన్ ఇలా..

ఐబీపీఎస్ కామన్ ప్రిపరేషన్ ఇలా..

ఆకర్షణీయమైన జీతంతో పాటు భవిష్యత్​కు భరోసా ఇచ్చే బ్యాంక్ కొలువులకు పోటీ పెరిగిపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌‌‌‌ (ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ పర్సనల్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌) విడుదల చేసిన క్లర్క్‌‌‌‌, ఎస్‌‌‌‌వో (స్పెషలిస్ట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌) ప్రిలిమ్స్ పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో, మెయిన్స్ జనవరి, ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్లర్క్, ఎస్‌‌‌‌వో పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు రెండింటికి కామన్​గా ఎలా ప్రిపేర్‌ కావాలో, ఏయే సబ్జెక్టులు ఉంటాయో 
ఈ వారం తెలుసుకుందాం..

బ్యాంకుల్లోని ఖాతాదారులకు, వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు క్లర్క్‌‌‌‌లు చేస్తారు.  హెచ్‌‌‌‌ఆర్, ఐటీ, లా, మార్కెటింగ్‌‌‌‌ తదితర ప్రత్యేకమైన విధులను బ్యాంకులో స్పెషలిస్ట్‌‌‌‌ ఆఫీసర్లు(ఎస్‌‌‌‌వో) చేపడతారు.  క్లర్క్‌‌‌‌ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్‌‌‌‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్‌‌‌‌వో పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలతో కూడిన మూడంచెల సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

సేమ్​ సిలబస్‌‌‌‌

క్లర్క్, ఎస్‌‌‌‌వో ప్రిలిమ్స్ సిలబస్‌‌‌‌లో ఉమ్మడి టాపిక్స్‌‌‌‌ ఉన్నాయి. క్లర్క్‌‌‌‌ ప్రిలిమినరీ పరీక్షలో.. ఇంగ్లిష్‌‌‌‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌‌‌‌ ఎబిలిటీ, రీజనింగ్‌‌‌‌ ఎబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎస్‌‌‌‌వో–ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ ఆఫీసర్, హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌/పర్సనల్‌‌‌‌ ఆఫీసర్, మార్కెటింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ప్రిలిమినరీ పరీక్షల్లోనూ.. ఇంగ్లిష్‌‌‌‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌‌‌‌ అప్టిట్యూడ్, రీజనింగ్‌‌‌‌ ఎబిలిటీల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

స్టడీ ప్లాన్​ 

న్యూమరికల్‌‌‌‌ ఎబిలిటీ/క్వాంటిటేటివ్‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌ క్లర్క్, ఎస్‌‌‌‌వో పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టతలో వ్యత్యాసం ఉంటుంది. క్లర్క్, ఎస్‌‌‌‌వో పరీక్షల్లో న్యూమరికల్‌‌‌‌ ఎబిలిటీలో సింప్లిఫికేషన్‌‌‌‌లు,అప్రాక్సిమేషన్‌‌‌‌లు, డేటా ఇంటర్‌‌‌‌ప్రిటేషన్, నంబర్‌‌‌‌ సిరీస్, వర్గ సమీకరణాలు ముఖ్యమైనవి. వీటి నుంచి దాదాపు 70 శాతం ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు శాతాలు, సగటు, నిష్పత్తి–అనుపాతం, లాభ నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, కాలం–దూరం, కాలం–పని, పర్ముటేషన్స్‌‌‌‌–కాంబినేషన్స్, తదితర అంశాలు కూడా కీలకమే. వీటితోపాటు డేటా ఇంటర్‌‌‌‌ప్రిటేషన్, డేటా అనాలసిస్‌‌‌‌ అంశాలు ఫోకస్ చేస్తూ సిద్ధమవ్వాలి. 

జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌

క్లర్క్‌‌‌‌ మెయిన్‌‌‌‌ పరీక్షలో మరో ముఖ్యమైన విభాగం.. జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌. ఎస్‌‌‌‌వో పోస్టులకు సంబంధించిన లా ఆఫీసర్, రాజ్‌‌‌‌భాషా అధికారి పరీక్షల్లోనూ ఇది ముఖ్యమైనది. సమకాలీన అంశాలపై పట్టు ఉన్న అభ్యర్థులు సులభంగా స్కోర్‌‌‌‌ చేయవచ్చు. 

రీజనింగ్‌‌‌‌ ఎబిలిటీ

క్లర్క్, ఎస్‌‌‌‌వో పరీక్షల్లో అభ్యర్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించేలా రీజనింగ్‌‌‌‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో కోడింగ్,డీకోడింగ్, డైరెక్షన్‌‌‌‌ టెస్ట్, బ్లడ్‌‌‌‌ రిలేషన్, ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ అండ్‌‌‌‌ అవుట్‌‌‌‌పుట్, డెసిషన్‌‌‌‌ మేకింగ్, సింబల్స్‌‌‌‌ అండ్‌‌‌‌ నొటేషన్స్, డేటా సఫీషియన్సీ, క్రిటికల్‌‌‌‌ రీజనింగ్‌‌‌‌పై ఫోకస్ చేయాలి. 

ఇంగ్లిష్‌‌‌‌ లాంగ్వేజ్

ఇందులో రీడింగ్‌‌‌‌ కాంప్రెహెన్షన్, పారా జంబుల్స్, క్లోజ్‌‌‌‌ టెస్ట్, సెంటెన్స్‌‌‌‌ ఇంప్రూవ్‌‌‌‌మెంట్, ఫిల్‌‌‌‌ ఇన్‌‌‌‌ ది బ్లాంక్స్, స్పాటింగ్‌‌‌‌ ద ఎర్రర్స్‌‌‌‌ టాపిక్స్‌‌‌‌ ముఖ్యమైనవి. వొకాబ్యులరీ, గ్రామర్‌‌‌‌ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. స్పాటింగ్‌‌‌‌ ద ఎర్రర్స్, ఇడియమ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్రేజెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, సెంటెన్స్‌‌‌‌ కరెక్షన్, సెంటెన్స్‌‌‌‌ రీ అరేంజ్‌‌‌‌మెంట్, వన్‌‌‌‌ వర్డ్‌‌‌‌ సబ్‌‌‌‌స్టిట్యూట్స్‌‌‌‌ను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి.

క్లర్క్‌‌‌‌ ఎగ్జామ్​

ఐబీపీఎస్‌‌‌‌ క్లర్క్‌‌‌‌ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు దశలు ఉంటాయి. క్లర్క్‌‌‌‌ పోస్టులకు గుర్తింపు పొందిన కళాశాల/ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

ప్రిలిమ్స్:  క్లర్క్‌‌‌‌ ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షలో మూడు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం గంట.

సబ్జెక్ట్ – మార్కులు: ఇంగ్లిష్‌‌‌‌ 30 మార్కులు, న్యూమరికల్‌‌‌‌ ఎబిలిటీ 35 మార్కులకు, రీజనింగ్‌‌‌‌ ఎబిలిటీ 35 మార్కులకు పరీక్ష ఉంటుంది.  నెగిటివ్‌‌‌‌ మార్కింగ్ ఉంటుంది.

మెయిన్స్: క్లర్క్‌‌‌‌ మెయిన్స్​ ఆన్​లైన్​ పద్ధతిలో ఉంటుంది. 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 

సబ్జెక్ట్ – మార్కులు: జనరల్‌‌‌‌/ ఫైనాన్షియల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ 50 మార్కులు, ఇంగ్లిష్‌‌‌‌  40 మార్కులు, రీజనింగ్‌‌‌‌ ఎబిలిటీ అండ్‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌  60 మార్కులు, క్వాంటిటేటివ్‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌ 50 మార్కులకు ఉంటాయి.

క్లర్క్‌‌‌‌ ప్రిలిమ్స్ ఎగ్జామ్: 18, 19  డిసెంబర్‌‌‌‌ 2021 

మెయిన్స్: జనవరి/ ఫిబ్రవరి 2022 

స్పెషలిస్ట్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌

ఐబీపీఎస్‌‌‌‌ ఎస్‌‌‌‌ఓ సెలెక్షన్ ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో–ఐటీ ఆఫీసర్,అగ్రికల్చరల్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ ఆఫీసర్, రాజ్‌‌‌‌ భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌/పర్సనల్‌‌‌‌ ఆఫీసర్, మార్కెటింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టులను భర్తీ చేస్తుంది.

ప్రిలిమ్స్

ఎస్‌‌‌‌వోలో వేర్వేరు పోస్టులు ఉండటంతో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్రిలిమ్స్ కూడా భిన్నంగా ఉంటుంది. ప్రశ్నల సంఖ్య, మార్కుల్లో తేడా లేకున్నా.. సబ్జెక్టులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. 

లా ఆఫీసర్, రాజభాష అధికారి:  ఈ పోస్టుల ప్రిలిమ్స్ పరీక్ష 150 ప్రశ్నలు–125 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ 25 మార్కులు, రీజనింగ్‌‌‌‌ 50 మార్కులు, జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌(బ్యాంకింగ్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌) 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. 

మెయిన్స్

రాజ్‌‌‌‌ భాషా అధికారి మినహా మిగతా పోస్టులకు ఒకే విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. లా, ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ ఆఫీసర్, హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌/పర్సనల్‌‌‌‌ ఆఫీసర్, మార్కెటింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టులకు ప్రొఫెషనల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. రాజ్‌‌‌‌భాషా అధికారి పోస్టుకు ప్రొఫెషనల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌కు సంబంధించిన 45 ఆబ్జెక్టివ్, 2 డిస్క్రిప్టివ్‌‌‌‌ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగిటివ్‌‌‌‌ మార్కులు ఉంటాయి. 

ఇంటర్వ్యూ

మెయిన్స్​లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది.

ఎస్‌‌‌‌వో ప్రిలిమ్స్‌‌‌‌: 26 డిసెంబర్‌‌‌‌ 2021

మెయిన్స్: 30 జనవరి 2022

- వెలుగు ఎడ్యుకేషన్​ డెస్క్