ఇండియా ఏఐ మోడల్స్‌‌ కు ఐసీఏఐ నుంచి కంపెనీల డేటా

ఇండియా ఏఐ మోడల్స్‌‌ కు ఐసీఏఐ నుంచి కంపెనీల డేటా

న్యూఢిల్లీ: భారతదేశం సొంతంగా అభివృద్ధి చెస్తున్న ఏఐ మోడల్స్‌‌కు అవసరమైన ఆర్థిక, ఆడిట్ డేటాను అందించేందుకు ఐసీఏఐ (ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) ముందుకొచ్చింది.  ఇందుకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్  ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ)తో చర్చలు జరుపుతోంది.దేశీయ ఎల్‌‌ఎల్‌‌ఎమ్స్‌‌ (లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్) అభివృద్ధిలో భాగంగా, ఐసీఏఐ లిస్టెడ్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, ఆడిట్ రిపోర్టులు వంటి ధృవీకరించిన డేటాను అందించనుంది. 

ఐసీఏఐకి 4 లక్షలకుపైగా మెంబర్లు ఉన్నారు. తన ఆడిటింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తోంది. ఏఐ ద్వారా రొటీన్‌‌, రిపీట్ అయ్యే పనులు చేయడం, నిరంతర ఆడిటింగ్, ఫ్రాడ్ డిటెక్షన్, రిస్క్ ఎనాలసిస్‌‌ వంటివి  సాధ్యపడతాయని తెలిపింది. కాగా, మొదటి భారత్‌ ఏఐ మోడల్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇండియా ఏఐ ఇంపాక్ట్‌‌ సమ్మిట్‌‌లో లాంచ్ అవుతుందని ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు.