గుడ్ న్యూస్.. టెన్త్ తర్వాతే సీఏ చేసే చాన్స్

గుడ్ న్యూస్.. టెన్త్ తర్వాతే సీఏ చేసే చాన్స్

న్యూఢిల్లీ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) టెన్త్ స్టూడెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పది తర్వాతే సీఏ ఫౌండేషన్ కోర్సులో చేరొచ్చని తెలి పింది. ఇప్పుడున్న రూల్స్ ను సవరిం చినట్లు పేర్కొంది. ఇంతకుముందు వరకు ఇంటర్ పూర్తయిన తర్వాతే సీఏ ఫౌండేషన్ కోర్సులో చేరాల్సి ఉండేది. ‘‘టెన్త్ పూర్తయిన తర్వాత స్టూడెంట్లు ఫౌండేషన్ కోర్సులో ప్రొవిజనల్ అడ్మిషన్ తీసుకోవచ్చు.ఇంటర్​తో పాటే 4 నెలల కోర్సును పూర్తి చేయొచ్చు. ఇంటర్ క్లియర్ చేస్తేనే అడ్మిషన్ కన్ఫమ్ అవుతుంది. ఆ తర్వాత ఫౌండేషన్ కోర్సు పరీక్ష రాయాలి’ అని ఐసీఏఐ ప్రెసిడెంట్ అతుల్ కుమార్ చెప్పారు. కొత్త రూల్స్ తో  6 నెలల ముందుగానే సీఏ పూర్తి చేయొచ్చని తెలిపారు.