సంస్కృతి యూనివర్సిటీకి ఐకార్ గుర్తింపు

సంస్కృతి యూనివర్సిటీకి ఐకార్ గుర్తింపు

సంస్కృతి యూనివర్సిటీకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐకార్) గుర్తింపు వచ్చిందని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్  డాక్టర్ సచిన్ గుప్తా వెల్లడించారు. తమ యూనివర్సిటీ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన... దేశంలోనే 400 పైగా కళాశాలలు ఉండగా ఐకార్ అక్రిడేషన్ పొందిన 16వ యూనివర్సిటీ తమదని చెప్పారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి ఉచితంగా 60 రోజుల కోర్సును అందిస్తున్నామని స్పష్టం చేశారు.

తద్వారా నర్సరీ, సీడ్స్, ఐటీ పోర్టల్ వంటి అగ్రికల్చర్ కు సంబంధించిన వ్యాపారాలను చేసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి గ్యారెంటీ లేకుండా 20 లక్షల వరకు లోన్ కూడా అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్  డాక్టర్ సచిన్ గుప్తా చెప్పారు. డిసెంబర్7 నుండి మొదటి బ్యాచ్ 60 మందితో ప్రారంభిస్తున్నామన్న ఆయన... పూర్తి సమాచారాన్ని తమ విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు.