షాబాద్​లో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పర్యటన

షాబాద్​లో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పర్యటన

చేవెళ్ల, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని మాచన్ పల్లిలో పర్యటించారు. నేషనల్ అంబేద్కర్ అవార్డు గ్రహిత కోళ్ల యాదయ్య, శశికళ దంపతుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వారు శాలువాతో సత్కరించారు. ఆయన వెంట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జ్ పామేన భీమ్ భరత్, పీసీసీ కార్యదర్శి రామ్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ నేతలు పెంట రెడ్డి, రాష్ట్ర  జనరల్ సెక్రటరీ ప్రసాద్, శంకర్ పల్లి మండల యువ నాయకులు ఉన్నారు.