- మొత్తం 671 పోలింగ్ కేంద్రాలు.. 4 లక్షలకు పైగా ఓటర్లు
చేవెళ్ల/వికారాబాద్/ఇబ్రహీంపట్నం/ మేడ్చల్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగడంతో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 671 పోలింగ్ కేంద్రాల్లో 4,03,118 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని ఆమన్గల్మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా 30 పోలింగ్ స్టేషన్లు, ఇబ్రహీంపట్నంలోని 24 వార్డులకు 48, షాద్నగర్ లో 28 వార్డులకు 76, శంకర్‌పల్లి 15 వార్డులకు 31, చేవెళ్లలో 18 వార్డులకు 37, మొయినాబాద్ లో 26 వార్డులకు52 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
వికారాబాద్జిల్లాలోని వికారాబాద్ మున్సిపాలిటీలో 34 వార్డులు, తాండూర్లో 36 వార్డులు, పరిగిలో 18 వార్డులు, కొడంగల్ లో 12 వార్డులకు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మంగళవారం నుంచే అమలులోకి వచ్చిందని, ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు తెలిపారు
