కర్మఫలం చెప్పే కృష్ణలీల

కర్మఫలం చెప్పే కృష్ణలీల

దేవన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణ లీల’. ధన్య  బాలకృష్ణన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.  జ్యోత్స్న జి నిర్మిస్తున్నారు.  ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు వీవీ వినాయక్ లాంచ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్‌‌‌‌‌‌‌‌ విషెస్ చెప్పారు. ‘ప్రేమించడం, ప్రేమించబడడం.. రెండూ కర్మలే. ఈ ప్రేమని అనైతికంగా అనుభవించాలనుకున్నా.. అవాయిడ్ చేయాలనుకున్నా.. అది మరింత కాంప్లికేటెడ్ అయి, ఎన్ని జన్మలైనా నీకు సరైన పాఠం నేర్పే వరకు వదలదు’ అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌తో మొదలైన టీజర్ ఆకట్టుకుంది.  వినోద్ కుమార్, పృధ్వీ,  రవి కాలే, సరయు, ఆనంద్ భరత్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.