Women’s World Cup 2025: మెన్స్‌ను మించిపోయారు: విజేతకు రూ.39 కోట్లు.. మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ మనీ వివరాలు వెల్లడి

Women’s World Cup 2025: మెన్స్‌ను మించిపోయారు: విజేతకు రూ.39 కోట్లు.. మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ మనీ వివరాలు వెల్లడి

భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న మహిళా వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచేసింది. సోమవారం (సెప్టెంబర్ 1) ఈ మెగా టోర్నీ ప్రైజ్ మనీ వివరాలను వెల్లడించింది. మొత్తం వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ. 122 కోట్లుగా నిర్ణయించారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 39 కోట్ల రూపాయలు అందుతాయి. రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుతాయి. సెమీ ఫైనల్ గా నిలిచిన రెండు జట్లకు  రూ. 10 కోట్ల ప్రైజ్ మనీ లభిచనుంది. ఒక్కో విజయానికి రూ. 30 లక్షల రూపాయాలు అందనున్నాయి. వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 8 జట్లకు రూ. 2.2 కోట్ల రూపాయలు దక్కనున్నాయి.     

చివరిసారిగా 2022లో జరిగిన వరల్డ్ కప్ తో పోలిస్తే ప్రైజ్ మనీతో 300 శాతం పెరగడం విశేషం. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు ఈ టోర్నీకి ఇండియా ఆతిధ్యమివ్వడంతో భారీ హైప్ నెలకొంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఏకంగా 2023లో మెన్స్ క్రికెట్ లో ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ. 88 ఓట్ల రూపాయాలు కాగా.. ప్రస్తుతం ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ. 118 కోట్లు కావడం గమనార్హం. అంటే మెన్స్ కంటే రూ.30 కోట్లు ఎక్కువన్నమాట. 

ALSO READ : రేపటి నుంచి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వైట్ బాల్ సిరీస్..

ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ..“ ఈ ప్రకటన మహిళా క్రికెట్ ప్రయాణంలో ఒక నిర్వచించదగిన మైలురాయిని సూచిస్తుంది. నాలుగు రేట్లు ప్రైజ్ మనీ పెరగడం మహిళా క్రికెట్‌కు ఒక మైలురాయి క్షణం. మహిళా క్రికెటర్లు క్రికెట్ ను ప్రొఫెషనల్ గా ఎంచుకుంటే మెన్స్ తో సమానంగా వ్యవహరిస్తారని తెలుసుకోవాలి. ఈ పురోగతి ప్రపంచ స్థాయి ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్‌ను అందించడం.. క్రీడాకారులు, అభిమానులను ప్రేరేపించాలనే మా ఆశయాన్ని నొక్కి చెబుతుంది". అని  జై షా తెలిపారు. 

మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. భారత్‎లోని ముంబై, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడ్‎లో నిర్వహించి.. భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ వేదికగా నిర్వహించారు. 

ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‎కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2017లో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వన్డే వరల్డ్ కప్ భారత మహిళలకు కలగానే మిగిలింది. ఈ సారి టోర్నీ భారత్‎లోనే జరుగుతుండటంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.