వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోలో పెళ్లికెళుతుండగా ఘోరం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోలో పెళ్లికెళుతుండగా ఘోరం

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటో నుజ్జు నుజ్జైంది. ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొలుత బాధితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కావడం గమనార్హం.

కొడంగల్ మండలం ఫర్సాపూర్ తాండా వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా పెళ్ళి వేడుక కోసం హైదరాబాద్ నుంచి వెళ్తుండగా రాకంచర్ల దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వ్యక్తులు ప్రమాదం అనంతరం పారిపోయారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత దారుణంగా గాయపడ్డారంటే.. ఒక మహిళకు కాలులో ఉన్న ఎముక బయటికొచ్చింది. ఆ దృశ్యాలు చూస్తేనే గుండెలు పిండేసినట్లయింది. పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

►ALSO READ | కీసరలో భూకబ్జా గుట్టురట్టు..చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్.. ఐదుగురు అరెస్ట్