
అంతర్జాతీయ క్రికెట్ లో రెండు పటిష్టమైన జట్లు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. షెడ్యూల్ లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల ఆడడానికి ఇంగ్లాండ్ లో సౌతాఫ్రికా పర్యటించింది. మొదట వన్డే మ్యాచ్ లు.. ఆ తర్వాత టీ20 సిరీస్ ఉంటుంది. మంగళవారం (సెప్టెంబర్ 2) లీడ్స్ వేదికగా హెడ్డింగ్లీలో తొలి వన్డే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 4, సెప్టెంబర్ మరియు 7 తేదీలలో వరుసగా రెండు, మూడు వన్డేలు జరగనున్నాయి. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ వరుసగా సెప్టెంబర్ 10, 12, 14 తేదీల్లో జరగనున్నాయి.
ఈ సిరీస్ లో అత్యుత్తమంగా రాణించి వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ కు ఇరు జట్లు ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలని చూస్తున్నాయి. ఆస్ట్రేలియాపై ఇటీవలే సౌతాఫ్రికా వన్డే సిరీస్ గెలిచి కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ రెండు నెలలుగా వైట్-బాల్ క్రికెట్ ఆడలేదు. ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్టును కొత్త కెప్టెన్ హ్యారీ బ్రూక్ నడిపించనున్నాడు. సౌతాఫ్రికా వన్డే జట్టును టెంబా బవుమా.. టీ20 జట్టుకు ఐడెన్ మార్క్రామ్ సారధ్య బాధ్యతలు వహిస్తారు. రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు కిక్ ఇవ్వడం గ్యారంటీగా మారింది.
ఇండియాలో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగబోయే మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లను ఇండియాలో సోనీ లివ్ యాప్ లో చూడొచ్చు. ఫ్యాన్ కోడ్ లోనూ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి.
స్క్వాడ్‌లు
ఇంగ్లాండ్ వన్డే జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్ , జామీ స్మిత్ (వికెట్ కీపర్).
ఇంగ్లాండ్ టీ20 జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), బ్రైడాన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), ల్యూక్ వుడ్.
దక్షిణాఫ్రికా వన్డే జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జీ, కేశవ్ మహారాజ్ , క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రామ్ , వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, లుంగి న్గిడి , లువాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబాడా , ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు:
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, డోనోవన్ ఫెర్రీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, సెనురాన్ ముత్తుసామి, లుంగి న్గిడి, లువాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబాడా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాద్ విలియమ్స్.