ICC player of the month: ముగ్గురూ ఫాస్ట్ బౌలర్లే: ఐసీసీ అవార్డు రేస్‌లో ఇండియన్ క్రికెటర్.. ఆగస్టు హీరోలు వీరే

ICC player of the month: ముగ్గురూ ఫాస్ట్ బౌలర్లే: ఐసీసీ అవార్డు రేస్‌లో ఇండియన్ క్రికెటర్.. ఆగస్టు హీరోలు వీరే

ఐసీసీ సోమవారం (సెప్టెంబర్ 9) ఆగస్టు 2025 ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ప్రకటించింది. వీరిలో ఒకరు భారత క్రికెటర్ ఉండగా.. న్యూజిలాండ్, వెస్టిండీస్ నుంచి ఒకొక్కరిని ఐసీసీ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో టెస్టులో అద్బుతమగా రాణించిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినీగా ఎంపికయ్యాడు. వెస్టిండీస్ నుంచి జేడెన్ సీల్స్.. న్యూజి లాండ్ నుంచి మాట్ హెన్రీ ఈ అవార్డు రేస్ లో ఉన్నారు. ఆసక్తికరంగా ముగ్గురూ పేస్ బౌలర్లే కావడం విశేషం. జూలై నెలకు గాను టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.  

ఓవల్ టెస్టులో సిరాజ్ మ్యాజిక్    

ఓవల్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఐదో టెస్ట్ సెకండ్ ఇన్సింగ్స్‎లో ఐదు వికెట్లతో చెలరేగి భారత్‎కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ కు భారీ ఆధిక్యం దక్కకుండా చేశాడు. ఓవరాల్ గా ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు తీసుకున్న సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరాజ్ అద్భుత స్పెల్ తో ఇంగ్లాండ్ తో సిరీస్ ను ఇండియా 2-2 తేడాతో సిరీస్ ను సమం చేసింది.  

హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్:  

గత నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ అత్యుత్తమంగా రాణించాడు. రెండు టెస్టుల్లో నిప్పులు చెరుగుతూ కేవలం 9.12 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. వీటిలో రెండుసార్లు రెండు ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో రాణించిన హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. హెన్రీ బౌలింగ్ తో కివీస్ 2-0 తేడాతో జింబాబ్వేపై టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది.   

►ALSO READ | Asia Cup 2025: ఆసియా కప్ 2025.. గ్రూప్-ఏ, గ్రూప్-బి స్క్వాడ్ వివరాలు.. సూపర్-4కు వెళ్ళేది ఆ నాలుగు జట్లేనా..

పాకిస్థాన్ పై జేడెన్ సీల్స్ విశ్వరూపం: 

34 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌పై వెస్టిండీస్ తొలిసారి వన్డే సిరీస్ గెలుచుకోవడంలో వెస్టిండీస్‌ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ కీలక పాత్ర పోషించాడు. సీల్స్ ఈ వన్డే సిరీస్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 4.1 ఎకానమీ రేటు.. 10 యావరేజ్ తో 10 వికెట్లు పడగొట్టాడు. మూడో వన్డేలో తన బౌలింగ్ తో విజృంభించిన ఈ విండీస్ పేసర్ 18 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం.