IND vs AUS: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచిన జట్టుకు ఎన్ని కోట్లో తెలుసా..?

IND vs AUS: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచిన జట్టుకు ఎన్ని కోట్లో తెలుసా..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం(మే 26) ప్రకటించింది. గత ఛాంపియన్‌షిప్ 2019-21 సైకిల్ మాదిరిగానే 2021-23లోనూ రూ.31.4 కోట్ల మొత్తాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని 9 జట్లు పంచుకోనున్నాయి. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు రూ.13.22 కోట్లు అందుకోనుండగా, రన్నర్‌గా నిలిచిన జట్టు రూ.6.6 కోట్లు సొంతం చేసుకోనుంది.

ఇక మూడవ స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా జట్టు రూ.3.7 కోట్లు అందుకోనుండగా.. నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ రూ.2.89 కోట్లు, ఐదోస్థానంలో నిలిచిన శ్రీలంకకు రూ.1.65 కోట్లు దక్కనున్నాయి. ఇక 6 నుంచి 9వ స్థానాల వరకూ ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లకు తలా రూ. 82 లక్షలు అందిస్తారు. విజేతకు గదతోపాటు రూ.13 కోట్ల భారీ ప్రైజ్ మనీ కూడా దక్కనుంది.

 కాగా, జూన్ 7 నుంచి 11వ తేదీ వరకూ భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటి ఛాంపియన్‌షిప్ టైటిల్ ను తృటిలో చేజార్చుకున్న భారత్, ఈసారి దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లి ప్రాక్టీస్ షురూ చేయగా, మిగిలిన ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నీ ముగిశాక బయలదేరనున్నారు.