దుబాయ్: ఇండియా విమెన్స్ టీమ్ పేసర్, హైదరాబాదీ అరుంధతి రెడ్డి ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా ఆడిన అరుంధతికి ఈ గౌరవం దక్కింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అత్యధికంగా 8 వికెట్లు తీసిన అరుంధతి ఆసీస్ గడ్డపై ఇండియా సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది.
మెన్స్ సెక్షన్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఈ అవార్డు నెగ్గాడు. టీ20 వరల్డ్ కప్‌లో రికార్డు స్థాయి రన్స్ మెరిసినందుకు ఫర్హాన్‌ను ఈ అవార్డు వరించింది. ఒక టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించడమే కాకుండా, ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా ఫర్హాన్ నిలిచాడు.
